సామాజిక, ఆర్థిక,రాజకీయాల్లో ప్రగతి వ్యూహంతో ఎకనామిక్​ డెవలప్​మెంట్​

సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికపరమైన ఉమ్మడి ఫలితమే ఆర్థికాభివృద్ధి. ఆర్థికకారకాలు, సంస్థలు, వ్యవస్థలు ఉమ్మడి ప్రగతి వ్యూహంతో ముందుకు సాగితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థికవృద్ధి అనేది పరిణామాత్మక మార్పులను సూచిస్తే, ఆర్థికాభివృద్ధి అనేది పరిమాణాత్మక మార్పులతోపాటు గుణాత్మక మార్పులనూ సూచిస్తుంది. అయితే, ఒక దేశంలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిని వృద్ధ మాపనులు లేదా అభివృద్ధి సూచికలు అంటారు. 

జాతీయాదాయాన్ని పోల్చడం: ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయాదాయం అంటారు. జాతీయాదాయంలో పెరుగుదల సంభవిస్తే దానిని అభివృద్ధికి సూచికగా భావించవచ్చు. జాతీయాదాయంలో పెరుగుదల రెండు కారణాల వల్ల సంభవించవచ్చు. అవి ఉత్పత్తిలో పెరుగుదల, ధరల స్థాయిలో పెరుగుదల. అయితే, నామ మాత్రపు జాతీయాదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా భావించడం సరికాదు. వాస్తవ జాతీయాదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా భావించడం ఉత్తమం. 

తలసరి ఆదాయం పోల్చడం: ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల సగటు వార్షిక ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది. జాతీయాదాయంలో పెరుగుదల కంటే తలసరి ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి మేలైన సూచికగా భావించవచ్చు. తలసరి ఆదాయంలో పెరుగుదల అభివృద్ధికి సూచికే. కానీ ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం పెరిగితే అభివృద్ధికి సూచికగా భావించడం సమంజసం కాదు. అందుకే వాస్తవ తలసరి ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి మేలైన సూచికగా భావించవచ్చు. 

సమగ్ర అభివృద్ధి సూచీ: ఈ సూచీని ఎవరెట్​ ఎ హెగెన్​ అనే ఆర్థికవేత్త 11 కొలమానాల ఆధారంగా రూపొందించాడు. అవి.. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, ఉద్యోగిత, కమ్యూనికేషన్స్​, మౌలిక పారిశ్రామిక వస్తువుల వినియోగం, మన్నిక గల వస్తువుల వినియోగం, పట్టణీకరణ, తలసరి ఆదాయం, సామాజిక వ్యక్తిగత సంక్షేమం, ఇతర సేవలు. 

ఎంఈడబ్ల్యూ (ఆర్థిక సంక్షేమ కొలమానం): ఈ సూచీని విలయం నర్ధవస్, జేబ్స్​ టోబిన్​ అనే ఆర్థిక వేత్తలు రూపొందించారు. 

ఎన్​ఈడబ్ల్యూ (నికర ఆర్థిక సంక్షేమం): ప్రజా సంక్షేమాన్ని పెంచే అంశాలు కొన్నింటిని వాస్తవ జాతీయాదాయానికి కలిపి, ప్రజా సంక్షేమాన్ని తగ్గించే అంశాలను తీసివేసి ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని ఆధునికీకరిస్తూ నికర ఆర్థిక సంక్షేమంగా పాల్​ శామ్యుల్​సన్​ రూపొందించాడు. వాస్తవ జాతీయాదాయానికి విశ్రాంతి సమయం విలువను, గృహిణుల సేవలు వంటి మార్కెట్​లోకి రాని సేవల విలువలను కలిపి పట్టణీకరణ, పర్యావరణ కాలుష్యం వంటి విలువలను తీసివేస్తే నికర ఆర్థిక సంక్షేమం తెలుపును. 
నికర ఆర్థిక సంక్షేమం= వాస్తవ జాతీయాదాయం + విశ్రాంతి సమయం విలువ + మార్కెట్​లో లెక్కింపబడని సేవల విలువ – పట్టణీకరణ – పర్యావరణ కాలుష్యం. 

పీక్యూఎల్​ఐ (భౌతిక నాణ్యత జీవన ప్రమాణ సూచీ): ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి జాతీయాదాయం, తలసరి ఆదాయాల కంటే పీక్యూఎల్​ఐ ద్వారా కచ్చితంగా లెక్కించవచ్చు. పీక్యూఎల్​ఐను ఆర్థిక వేత్త మోరిస్​ డేవిడ్​ మోరిస్​ రూపొందించాడు. 1979లో 23 దేశాల పీక్యూఎల్​ఐని లెక్కించి అభివృద్ధిని గణించాడు. పీక్యూఎల్​ఐని మూడు అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అవి.. ఆయు: ప్రమాణం (ఎల్​ఈఐ), శిశు మరణాల రేటు(ఐఎంఐ​), అక్షరాస్యత (బీఎల్​ఐ).

పీక్యూఎల్​ఐ = ఎల్​ఈఐ + ఐఎంఐ + బీఎల్​ఐ/ 3

మోరిస్​ ప్రకారం ఆయు: ప్రమాణం, అక్షరాస్యత అధికంగా ఉండి శిశు మరణాల రేటు తక్కువగా ఉండే దేశాల పీక్యూఎల్​ఐ విలువ ఎక్కువగా ఉంటుంది. పీక్యూఎల్​ఐ స్కేలు 1 నుంచి 100 ఉంటుంది. పీక్యూఎల్​ఐ విలువ 1కి దగ్గరగా ఉన్న దేశంలో అభివృద్ధి తక్కువగా ఉందని, పీక్యూఎల్​ఐ 100కి దగ్గరగా ఉన్న దేశంలో అభివృద్ధి ఎక్కువగా ఉందని అర్థం. 

మూడు అంశాల ఆధారంగా పీక్యూఎల్​ఐ విలువను లెక్కిస్తారు. కాబట్టి పీక్యూఎల్​ఐని మోరిస్​ మిశ్రమ సూచిక అని లేదా సామాన్య సమీకృత సూచీ అని పిలుస్తారు. పీక్యూఎల్​ఐలో శిశుమరణాల రేటు, ఆయు: ప్రమాణం, అక్షరాస్యత అన్నీ జనాభాకు సంబంధించినవే. అంటే సాంఘిక అంశాలే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఆర్థిక అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని విమర్శ ఉంది. 

మానవ పేదరికపు సూచీ: యూఎన్డీపీ వారు 1997 నుంచి తన మానవాభివృద్ధి నివేదిక (హెచ్​డీఆర్​)లో భాగంగా హెచ్​పీఐని ప్రకటించడం ప్రారంభించారు. హెచ్​పీఐలో వివిధ దేశాలకు హెచ్​పీఐ విలువను బట్టి విలోమంగ ర్యాంకులను ఇస్తారు. హెచ్​పీఐ స్కేల్​: 0 నుంచి 100 వరకు ఉంటుంది. హెచ్​పీఐ విలువ 0కు దగ్గరగా ఉంటే పేదరికం తక్కువ అని హెచ్​పీఐ విలువ 100కు దగ్గరగా ఉంటే పేదరికం ఎక్కువగా ఉన్నట్లు అర్థం. 

హెచ్​పీఐ విలును లెక్కించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. 

  • 40 సంవత్సరాల వయస్సు రాకముందే మరణించే జనాభా శాతం
  • వయోజనుల్లో నిరక్షరాస్యత శాతం
  • ఎ. మెరుగైన జీవన ప్రమాణ స్థాయి లభించని జనాభా శాతం
  • బి. రక్షిత మంచినీరు లభించని జనాభా శాతం
  • సి. ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపం గల పిల్లల శాతం 

1998లో హెచ్​పీఐని హెచ్​పీఐ–1గా అభివృద్ధి చెందుతున్న దేశాల వరకే పరిగణిస్తూ అభివృద్ధి చెందిన దేశాలు(ఓఈసీడీ) కోసం హెచ్​పీఐ–2ను ప్రవేశపెట్టారు. హెచ్​పీఐ–2లో హెచ్ పీఐ–1ల తీసుకునే మూడు అంశాలతోపాటు నాలుగో అంశంగా దీర్ఘకాలిక నిరుద్యోగితను కూడా పరిగణించారు. 

యూఎన్​డీపీ వారు 2024, మార్చిలో  ప్రకటించిన హెడీఆర్​ 2023–24లో 2022 సమాచారాన్ని బట్టి తయారు చేసిన హెడీఐలో భారత్​ 0.644 హెచ్​డీఐ విలువతో 191 దేశాల్లో 134వ స్థానంలో ఉంది. 

బహుముఖ పేదరిక సూచీ: 2010 హెచ్​డీఆర్​ నుంచి హెచ్​పీఐ–1, హెచ్​పీఐ–2లను రద్దు చేసి, వాటి స్థానంలో యూఎన్​డీపీ వారు ఎంపీఐను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎంపీఐను యూఎన్​డీపీ, ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీకి సంబంధించిన ఆక్స్​ఫర్డ్​ పావర్టీ, హ్యూమన్​ డెవలప్ మెంట్​ ఇనీషియేటివ్​ (ఓపీహెచ్​ఐ) వారు సంయుక్తంగా రూపొందించి ప్రకటించారు. 

ఎంపీఐ స్కేల్​ 0 నుంచి 1. దీనిని బట్టి ఒక దేశపు పేదరికపు స్థాయిని, పేదరికపు తీవ్రతను గుర్తించవచ్చు. (ఎంపీఐలో ర్యాంకులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు)
ఎంపీఐ విలువను లెక్కించడానికి జీవన ప్రమాణ స్థాయి, విద్య, ఆరోగ్యం అనే మూడు అంశాలకు సంబంధించి 10 సూచికలను తీసుకుంటారు. 

  • 1. జీవన ప్రమాణ స్థాయిలో ఆస్తులు, గృహ వసతి, విద్యుత్​, తాగునీరు, టాయిలెట్స్​, వంట ఇంధనం
  • 2. విద్య: పిల్లల నమోదు, హాజరు, సగటున స్కూల్​లో చదివిన సంవత్సరాలు ఆరు కంటే తక్కువగా ఉన్న పిల్లలు గల కుటుంబాలు
  • 3. ఆరోగ్యం: బాలల మరణాల రేటు, పౌష్టికాహార లోపం ఎంపీఐ 2023 ప్రకారం ప్రపంచంలో మొత్తం పేదవారి సంఖ్య 1.1 బిలియన్లు. ప్రపంచ పేదల సంఖ్యలో ఇండియాలో 23  కోట్ల పేదలు ఉన్నారు. భారత్​లో గడిచిన 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు.  

మానవ అభివృద్ధి సూచిక :  ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధికి మేలైన సూచికగా హెచ్​డీఐని భావిస్తున్నారు. 1991లో పాకిస్తాన్​కు చెందిన ఆర్థికవేత్త మహబూబ్​ ఉల్​ హక్​ (అబుల్​ హక్​) హెచ్​డీఐని రూపొందించారు. ఈ సూచికను రూపొందించడంలో అబుల్​ హక్ కు ఆర్థికవేత్త అమర్త్యసేన్​ సహాయం చేశారు. హెచ్​డీఐ 1990 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి నివేదికలో భాగంగా యూఎన్​డీపీ వారు హెడీఐని తయారుచేసి ప్రకటిస్తున్నారు. అముల్​ హక్​ రూపొందించిన హెడీఐని యూఎన్​డీపీ వారికి అనుగుణంగా మారుస్తూ ఆర్థికవేత్త పాల్​ స్ట్రీటన్ అభివృద్ధి చేశారు. 

ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి నివేదికలో ప్రపంచ దేశాల రెండు సంవత్సరాల క్రితపు సమాచారాన్ని అనుసరించి హెడీఐని తయారు చేసి ప్రకటించేవారు. కాని హెచ్​డీఆర్​ 2013 నుంచి ఏడాది క్రితపు సమాచారాన్ని అనుసరించి హెచ్​డీఐని తయారు చేసి ప్రకటిస్తున్నారు. హెచ్​డీఐ సూచీ విలువను లెక్కించడానికి మూడు అంశాలను ఆధారంగా తీసుకుంటారు. అవి..

  • ఆయు: ప్రమాణం/ ఆయుర్ధాయం/ జీవన కాలం 
  • విజ్ఞానం/ విద్యాస్థాయి
  • జీవన ప్రమాణం