Life style News: టీవీ చూస్తూ.. తింటున్నారా.. ఆరోగ్యానికి ఇబ్బందులే..

ఆరోగ్యంగా ఉండాలంటే ఏకాగ్రత ముఖ్యం. ఒత్తిడిలో ఏ పని చేసినా పొరపాట్లు దొర్లుతాయి. అందుకు సరైన తిండి తినకపోవడం ఒక కారణమైతే.. తిండి మీద ధ్యాస లేకుండా తినడం కూడా ఒక కారణం. తినేటప్పుడు ఏకాగ్రతగా ధ్యాస మొత్తం తిండి మీదనే పెట్టి తినాలంటున్నారు నిపుణులు. చాలామంది టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూనో తింటుంటారు. ఇలా తింటే ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read :- 18 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం..

 తినడం, టీవీ చూడడం అనేవి రెండూ డిఫరెంట్ పనులు. రెండూ ఒకేసారి చేయడం వల్ల మెదడు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. ఆ ఎఫెక్ట్ ఆరోగ్యం మీద ఉంటుందట. అందుకే.. సరైన తిండి తినడంతో పాటు సరైన పద్ధతిలో తినాలంటున్నారు. తిన్న ఆహారాన్ని బట్టి శరీరానికి పని చెప్పడం, విశ్రాంతి ఇవ్వడం కూడా ముఖ్యమే అంటున్నారు. టీవీ చూస్తూ తినడం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. టీవీ చూస్తూ స్నాక్స్ తినేవారు, ఇతర ఆహార పదార్థాలు తినేవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని బ్రెజిల్ సైంటిస్టులు చేసిన పరిశోధనలో తేలింది.