Good Health : పిస్తా తినటం వల్ల ఇన్ ఫెక్షన్ రాదు.. అలా అని ఎక్కువ తినొద్దు

పిస్తాలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. పిస్తాను స్నాక్స్ కోసం వాడితే మంచిదే. ఎందుకంటే...

Also Read : వరి సాగు వదిలేసి.. స్ట్రాబెర్రీ పండించాడు.. లక్షలు సంపాదించిన యువ రైతు

• శరీరంలోని అవయవాలకు సరిపడా ప్రాణవాయువుని చేరవేస్తుంది.
• విటమిన్ బి6 రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది.
• ప్రతిరోజూ గుప్పెడులో సగం పిస్తా తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ 'ఇ' అందుతుంది.
• శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కొత్త కణాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
• కంటి సమస్యలతో బాధపడేవాళ్లు వీటిని తరచూ తీసుకుంటే మంచిది.
• వీటిలో ఉండే పోషకాలు చర్మ క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడతాయి.
• క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది. 
•  చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
• అతి నీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతూ ముడతలను దూరం చేస్తుంది.