Good Health : పొద్దు తిరుగుడు గింజలు తింటున్నారు.. నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా..?

సూర్యుడు ఎటు వైపు తిరిగితే.. అటువైపే పొద్దు తిరుగుడు పువ్వులు కూడా తిరుగుతూ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా కనిపించే పొద్దు తిరుగుడు పూలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయంటున్నారు నిపుణులు.

సరదాగా శ్నాక్స్ తినాలంటే ఈ మధ్య చాలామంది మొలకెత్తిన గింజలే తింటున్నా రు. ఆ జాబితాలో పొద్దు తిరుగుడుపువ్వు గింజలు కూడా చేరాయి. పుష్కలమైన పోషక విలువలున్న పొద్దు తిరుగుడు నూనె కూడా తక్కువ కొవ్వు పదార్థాలతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలు తియ్య తియ్యగా, పప్పుల్లా ఉండడంతో ఈ మధ్య స్నాక్స్ లో ఎక్కువమంది వీటిని పువ్వు విత్తనాలు తినడానికే ఇష్టపడుతు న్నారు. 

పొద్దు తిరుగుడు పువ్వులో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెజబ్బులు రాకుండా రక్షణనిస్తుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. పావుకప్పు పొద్దు తిరుగుడు విత్తనాల్లో 90 శాతం విటమిన్- ఇ లభిస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ శరీ రంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుం ది. ఈ సీడ్స్ లోని డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని పెంచి.. మల బద్ధకాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ బాధితులకు పొద్దు తిరుగుడు చాలా మంచిది. ఈ విత్తనాలను రోజూ తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాదు.. పెద్ద పేగు క్యాన్సర్ను నివారించే గుణాలు కూడా పొద్దుతిరుగుడులో ఉన్నాయి.ఎముకల దృఢత్వానికి కావాల్సిన మాంగనీసు పొద్దు తిరుగుదులో ఉంటుది. మైగ్రెయిన్ని నివారిస్తుంది. 

ఆరోగ్యంతో పాటు.. అందాన్ని కాపాడడంలో కూడా పొద్దు తిరుగుడు ముందే ఉంటుంది. చర్మాన్ని మృదువుగా మార్చి రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. ఆస్తమాను నివారించే ఔషధ గుణాలు కూడా పొద్దు తిరుగుడులో చాలా ఉన్నాయి. ఈ విత్తనాలు, పూవుల పొగను పీలిస్తే ముక్కురంధ్రాలు బ్లాక్ కావు. జలుబు, దగ్గు తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్లోని విటమిన్- ఎ కళ్లకు ఎంతో మంచిది. కంటిచూపును మెరుగు పరిచి దృష్టి లోపాలను నివారిస్తుంది. పొద్దు తిరుగుడులో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ గింజలు, పువ్వులు, ఆకులను నలిపి గాయాలకు మందుగా కూడా వాడొచ్చు. 

వయసు పెరిగేకొద్దీ వచ్చే లక్షణాలను తగ్గించి చర్మకాంతిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యం, అందం కోసం కావాల్సిన పోషకాలు కూడా సన్ ఫ్లవర్ విత్తనాల్లో కావాల్సినన్ని ఉంటాయి. జుట్టు పోషణకు కావాల్సిన సెలెనియం, ప్రొటీన్స్, విటమిన్- ఇ, బి వంటి పోషకాలు పొద్దు తిరుగుడులో పుష్కలంగా ఉన్నాయి.   జుట్టు రాలడం, తెల్లబడడం, బలహీనమైన జుట్టు వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది.

సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది.. ఎందుకో తెలుసా?

పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు ఎటువైపు తిరిగితే.. అటువైపే ఎందుకు తిరుగుతుం దో తెలుసా? దానికి ఓ కారణం ఉంది. సన్ ఫ్లవర్లో ఉండే ఫొటో ట్రాఫిజమ్ అనే చర్య కారణంగా ఈ పువ్వు సూర్యుడిని ఫాలో అవుతుంది. మిగతా మొక్కల కంటే భిన్నంగా.. సన్ ఫ్లవర్ సూర్యరశ్మికి స్పంది స్తుంది. మిగతా మొక్కలు ఒక దశ వరకే సూర్యరశ్మికి స్పందించి ఆగిపోతాయి. కానీ.. సన్ ఫ్లవర్ మాత్రం... పెరుగుదలతో పాటు.. సూర్యరశ్మికి ప్రతిస్పందిస్తుంది.. దీన్నే ఫొటోట్రాఫిజమ్ అంటారు. 

మొక్కలో ఉన్న అమైనో ఆమ్లాలు, కార్బోహై డ్రేట్లు విచ్ఛిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకు కారణమవుతుంది. అయితే.. సన్ ఫ్లవర్ లో మాత్రం.. ఈ ఆక్సిన్ చర్య కాండంలో జరుగుతుంది. అందుకే.. మొక్క ఎదగడం కోసం సూర్యరశ్మి కోసం సూర్యుడు ఎటు తిరిగితే ఈ పువ్వు అటు వైపు తిరుగుతుంది. దీంతో.. సూర్యరశ్మి పడని భాగంలో ఆక్సిన్ ఉత్పత్తి జరిగి మొక్కలోని ఆ భాగం వేగంగా పెరుగుతుంది. ఫలితంగా పువ్వు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎదగాల్సిన భాగం మీద సూర్యరశ్మి పదకుండా... సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల పువ్వు ముందుభాగం కదులుతున్నట్టు అనిపిస్తుంది.