Women Health : బ్రకోలి తింటున్నారా.. మహిళలకు క్యాన్సర్లు రాకుండా సాయం చేస్తుంది

క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒకరకమైన ఆకుకూరబ్రకోలి. బ్రకోలిలో ఉండే గ్రుసినోలేట్స్ కళ్లకు మేలు చేస్తాయి. గ్రుకోమా వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. మిగతా కూరల్లో లేనంత విటమిన్ సి, ఎ, కెలు బ్రకోలిలో ఉంటాయి. వంద గ్రాముల బ్రకోలిలో ఉండే విటమిన్ సి. ఒక కమలా పండు రసంలో ఉన్నసి విటమిన్ పరిమాణానికి సమానంగా ఉంటుందంటే విషయం అర్థమవుతుంది. అదేవిధంగా ఇందులో ఉండే ప్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్.. జీర్ణాశయ గోడలు, రక్తనాళాల లోపలి పొరలను సురక్షితంగా ఉంచుతాయి. భోజనానికి ముందు ఆకలి పెరగడానికి దీనిని ఎక్కువగా తినడం కొన్ని దేశాల్లో ఆనవాయితీ. 

బ్రకోలి క్యాన్సర్ కు శత్రువు. క్యాన్సర్ శరీరంలోని కణాలను విపరీతంగా విభజన చెందించి మనిషి చావుకు కారణమవుతుంది. బ్రకోలి రూపు రేఖలు అచ్చం క్యాన్సర్ కణాల్ని పోలి ఉంటాయి. వీటిని మెమాలో భాగంగా చేసుకుంటే మహిళలలో వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా అరికట్టవచ్చని, ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నిలువరిస్తుందని తేలింది.

బ్రకోలిని తినటం ద్వారా తగినంత సల్ఫోరా ఫైన్ విడుదల అవుతుంది. కేన్సర్ విస్తరించడానికి, మళ్లీ తిరిగిరావటానికి కారణమయ్యే మూలకణాల సంఖ్యను సల్ఫోరాపైన్ తగ్గిస్తుంది. బ్రకోలి తినడం వల్ల మధుమేహ బాధితుల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.