Good Health : చలికాలంలో బరువు తగ్గడానికి ఇవి తినండి

చలికాలంలో గరంగరం స్నాక్స్ తినడం చాలామందికి అలవాటు. అంతేకాదు నచ్చిన ఫుడ్ ఎక్కువగా తినడం, బోర్డమ్, స్ట్రెస్ వల్ల అతిగా తినడం బరువు పెరిగేలా చేస్తాయి. ఈ సీజన్లో లో హెల్దీఫుడ్ తినడం చాలాముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అందుకోసం ఏం చేయాలో కూడా చెబుతున్నారు. 

పుడ్ డైరీ..

రోజూ ఏ రకం ఫుడ్ తింటున్నారు? ఎలాంటి డ్రింక్స్ తాగుతున్నారు? ఎంత సేపు ఎక్సర్ సైజ్ చేస్తున్నారు..... ఈ వివరాలన్నీ డైరీలో రాయాలి.వారం తర్వాత డైరీ తిరగేస్తే, ఏవి ఎక్కువ తింటున్నారో! ఎక్కువ తాగుతున్నారో! తెలుస్తుంది. దాంతో హెల్దీఫుడ్ ని అలవాటు చేసుకోవడం ఈజీ అవుతుంది. 

వర్కవుట్ రొటీన్ లో... 

హెల్దీగా ఉండాలంటే వారానికి కనీసం రెండున్నర గంటలు ఎక్సర్సైజ్లు చేయాలి. జాగింగ్, వేగంగా నడవడం వంటివి వర్కవుట్ రొటీన్ లో ఉండాలి. రోజుకి ఎంత దూరం నడిచారో తెలుసుకునేందుకు 'పొడో మీటర్' యాప్ సాయం తీసుకోవచ్చు. ఎన్ని క్యాలరీలు కరిగాయో? కూడా ఈ యాప్ చెప్పేస్తుంది. 

నీళ్లు మరవొద్దు..

మెటబాలిజం బాగా జరగడానికి, రోజంతా హుషారుగా ఉండడానికి నీళ్లు సరిపోను తాగాలి. రోజుకు 6-8 గ్లాసుల నీళ్లు తాగాలి. తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, షుగర్ ఉండని డ్రింక్స్ కూడా హెల్కు మంచివే. 

శ్నాక్స్ ప్లాన్..

మీల్స్ బ్రేక్ లో శ్నాక్స్ తప్పనిసరి. అయితే, అవి కూడా 100 క్యాలరీలు ఉన్న స్నాక్స్ తినాలి. స్నాక్ గా పది బాదం పలుకులు లేదంటే ఉడకబెట్టిన గుడ్డు తింటే బెస్ట్. 

చిన్న ప్లేట్స్...

పెద్ద ప్లేట్ నిండా వడ్డించుకుని తినడం మానేయాలి. క్యాలరీలు ఎక్కువ ఉండే మాంసం, ఛీజ్ వంటి వాటిని చిన్న లో వేసుకుని తక్కువ తింటారు.