చలికాలంలో స్నాక్ నల్లని ఎండు ద్రాక్ష తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. కేకులు, ఖీర్, బర్ఫీలలో కలిపి తినొచ్చు కూడా. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఈ డ్రై ఫ్రూట్స్ సాయపడతాయి. వీటితో మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అవేంటంటే...
• నల్లని ఎండు ద్రాక్ష తింటే ఆస్టియోపొరోసిస్ సమస్య రాకుండా జాగ్రత్తపడొచ్చు.
• ఈ సీజన్లో జుట్టు పొడిగా ఉంటుంది. వెంట్రుకల కొసలు చిట్లిపోతుంటాయి కూడా. ఈ సమస్య తగ్గాలంటే రోజూ కొన్ని నల్లని ఎండు ద్రాక్షలు తినాలి.
• వీటిలోని ఐరన్, విటమిన్-సిజుట్టుకి పోషకాలు అందేలా చేస్తుంది. దాంతో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, ఎనీమియా బారిన పడకుండా కాపాడుతుంది.
• రోజూ కొన్ని నల్లని ఎండు ద్రాక్ష తింటే, నెలసరి నొప్పులు తగ్గిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. వీటిలోని ఫైటోకెమికల్స్ నోటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నోటి దుర్వాసన పోగొడతాయి కూడా.