ఇళ్లు క్లీన్ చేసేటప్పుడు రిఫ్రిజిరేటర్, బీరువా, వాషింగ్ మెషిన్, ఫర్నిచర్ పక్కకు జరపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. వాటి కింద ఈ జ్లోవియో కంపెనీ స్లైడర్లను పెడితే ఈజీగా జరపొచ్చు. ఈ సెట్‌లో నాలుగు స్లైడర్లు, ఒక లిఫ్టర్ వస్తాయి. లిఫ్టర్ సాయంతో బీరువాని పైకి ఎత్తి దానికింద స్లైడర్లు పెడితే సరిపోతుంది. ఒక్కో స్లైడర్‌కు నాలుగు చక్రాలు ఉంటాయి. వాటి సాయంతో స్లైడర్లు కదులుతాయి. ఇవి గరిష్టంగా 150 కిలోల బరువు మోస్తాయి. ఇవి యాంటీ -స్లిప్ డిజైన్‌తో వస్తాయి. మన్నికైన స్టీల్ బాడీ ఉంటుంది. పీవీసీ ప్లాస్టిక్ స్ప్రేయింగ్ హ్యాండిల్‌తో వస్తుంది. స్లైడర్లు ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారయ్యాయి.
ఐ మసాజర్
కళ్ల కింద ముడతలు పోగొడుతుంది ఈ మసాజర్. దీంతో మసాజ్ చేస్తే.. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, చర్మం కాంతివంతంగా మారే అవకాశం ఉంది. డార్క్ స్పాట్స్ కూడా కొంతవరకు తగ్గుతాయి. ఇందులోని మోటర్ 4,500 ఆర్పీఎంతో తిరుగుతుంది. కాబట్టి పవర్‌ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు సైనసైటిస్ పెయిన్ నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. కాన్సెప్టా అనే కంపెనీ ఈ మసాజర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. దీరిలొ ఒక ఏఏ బ్యాటరీ వేస్తే చాలు.
ధర : 299 రూపాయలు
యాంటీ థెఫ్ట్ లాక్
ఊరికెళ్లినా మనసంతా ఇంటి మీదే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇంట్లో దొంగలు పడతారేమోనని భయం వెంటాడుతుంటుంది. అలాంటివాళ్లకు తక్కువ ధరలో దొరికే బెస్ట్ యాంటి థెఫ్ట్ మోషన్ సెన్సర్‌లాక్ ఇది. దీన్ని భడాని సేల్స్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ లాక్ జింక్ అల్లాయ్ బాడీతో వస్తుంది. కాబట్టి తుప్పు పట్టదు. రెయిన్ ప్రూఫ్‌తో వస్తుంది. కాబట్టి మెయిన్ గేట్‌కి కూడా ఈ లాక్ వేసుకోవచ్చు. ప్యాడ్‌లాక్‌తో వస్తుండడంతో బైక్, గ్యారేజ్ డోర్, గార్డెన్ షెడ్, సైడ్ గేట్, టూల్ బాక్స్, లాకర్‌కు కూడా ఈ లాక్ వేయొచ్చు. ఈ హై సెక్యూరిటీ లాక్‌లో హెవీ డ్యూటీ 110dB సైరన్ అలారం ఉంటుంది. ఏదైనా వస్తువుతో దీన్ని పగులగొట్టాలని చూసినా, వేరే తాళం చెవితో తెరవాలని ట్రై చేసినా వెంటనే అలారం మోగుతుంది. ఈ లాక్‌తో మూడు కీలు వస్తాయి. ఇందులో ఆరు బ్యాటరీలు వేయాలి.
ధర : 402 రూపాయలు
ఏరోప్లేన్ లాంచర్ గన్
పిల్లలు ఏరోప్లేన్ టాయ్స్‌ని చాలా ఇష్టపడతారు. అలాంటి పిల్లలకు దీన్ని కొనిస్తే సరిపోతుంది. ఇది ఏరోప్లేన్‌ని లాంచ్ చేసే టాయ్ గన్. గన్‌లో బుల్లెట్లను లోడ్ చేసినట్టు ఇందులో ఏరోప్లేన్స్‌ని లోడ్ చేసి ట్రిగ్గర్ నొక్కితే.. గాల్లోకి ఎగురుతుంది. ఈ గన్ సెట్‌లో కాటాపుల్ట్ ప్లేన్, ఫ్లయింగ్ టాయ్స్, ఆటో-లాంచర్ షూటింగ్ టాయ్ గన్, ఫోమ్ గ్లైడర్ ప్లేన్స్ వస్తాయి. ముందుగా ఫోమ్ గ్లైడర్ ప్లేన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత లాంచ్ గేర్‌ని లాగి, గన్ ట్రిగ్గర్ నొక్కితే సరిపోతుంది. దీన్ని ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారుచేశారు.
ధర : 399 రూపాయలు