పైకొచ్చే లక్షణం ఒక్కటి లేదు, రాత్రి రెండింటికి పడుకోవడం, పొద్దున్నే పదింటికి లేవడం.. కాస్త
తెల్లారగట్ల లేచి ఏడిస్తే జీవితంలో బాగుపడతాడు అని జులాయి సినిమాలో తనికెళ్ళ భరణి అంటే తెల్లారి గట్ల కోడి కూడా లెగుస్తుంది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తినేస్తున్నారు అల్లుఅర్జున్ అంటాడు. జులాయి సినిమాలోనే కాదు ఏ ఇంట్లో చూసినా పొద్దున్నే లేవమని ఒకటే గోల. ' జీవితంలో సక్సెస్ అయినవాళ్లందరికీ ఉండే గొప్ప అలవాటు ఉదయాన్నే లేవడమే' అంటూ ఇంట్లో నాన్నల నుంచి స్కూల్లో టీచర్ల దాకా అందరూ ఇదే మాట. అసలు ఈ ఉదయాన్నే లేవడం నిజంగా అందరికీ వర్తిస్తుందో, లేదో చుద్దాం...
"యాపిల్ సీఈవోలు టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్. వీళ్లంతా ఉదయం ఐదు గంటలకన్నా ముందు లేచే అలవాటున్న వాళ్లు తెలుసా.. అందుకే వాళ్లంతా సక్సెస్ అవ్వగలిగారు" అని కొంత మంది అంటుంటే ఓహో అలాగా! అయితే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, హథవే సీఈవో వారెన్ బఫెట్... వీళ్లందరూ చాలా లేట్ గా లేచే అలవా టున్నవాళ్లు. మరి వీళ్ల సంగతి ఏంటి. వీళ్లు కూడా సక్సెస్ పీపుల్ కదా!" అని కొందరంటున్నారు.
అందరికీ కాదు..
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఎక్కువ సర్విస్ అవుతారు. లక్ష్యాలు చేరుకోవచ్చు. ఎవరైతే లేటుగా నిద్రలేస్తారో వాళ్లలో.. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని ఇప్పటి దాకా చెప్పు వచ్చారు. కానీ ఉదయాన్నే లేవడం అందరికీ వర్తించదని ఇప్పుడు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సక్సెస్ అనేది మన సామర్థ్యా న్నిబట్టి ఉంటుంది. ఉదయాన్నే లేచిన ప్రతిఒక్కరూ సక్సెస్ " అవుతారని కాదు. మొన్నీమధ్య ఏడు లక్షల మంది పై సర్వే చేసి చూస్తే.. పని సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కో టైంలో బాగుం టుందని, మార్నింగా, నైటా అనేది వాళ్ల జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని వెల్లడైంది. ఇంకొన్ని రీసెర్చ్ ల ప్రకారం చాలా మందికి రాత్రిల్లో మరింత మెరుగ్గా పని చేస్తారట. మరికొంత మంది మధ్యాహ్నం బాగా చేయగలుగుతారంట.
గుడ్డిగా ఫాలో అవ్వొద్దు..
ఉదయం లేవడం వల్ల యాక్టివ్ గా లేమని అనిపిస్తున్నా.. అందరూ చెప్తున్నారని ఉదయాన్నే లేస్తుంటే మీకు మీరు ద్రోహం చేసుకుంటున్నట్టే, నిజానికి ఉదయాన్నే టీవడానికి ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి. సీఈవోలు, సెలబ్రి టీలకు రోజు బోలెడు పనులు ఉంటాయి. వాళ్లకు కాస్త జిమ్ చేయడానికి , మెయిల్స్ చూసుకోడానికి కూడా టైం ఉండదు. మరప్పుడు ఏం చేయాలి? కచ్చితంగా ఉదయం లేవాల్సిందే కదా. అందుకే అలా చేస్తుంటారు. దీన్ని అందరూ గుడ్డిగా ఫొటో అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు సైకాలజిస్టులు.
నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా...
దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. ఒక మనిషికి ఎంత నిద్ర అవసరమో అంతే నిద్ర పోవాలని, అది కూడా రోజూ ఒకే సమయానికి అలవాటు చేసుకోవాలని స్లీప్ స్పెషలిస్ట్ షెల్ సలాస్ అన్నారు. 'మీ నిద్రను త్యాగం చేయడం వల్ల చాలానే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ్. నిద్రలేమి, ఏకాగ్రత తగ్గిపోవడం, ఒఏకేసారి బరువు పెరగడం, ఇంకా పలు గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. త్వరగా లేవడం అంటే నిద్రని తగ్గించేయడం. ఆ పని అస్సలు చెయ్యొద్దంటున్నారు సలాస్.
సలాస్ దగ్గరకు వచ్చే పేషంట్స్ లో చాలామంది ఇరవై ముప్పై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలానే ఉదయాన్నే లేవాలన్ని నిద్రను నాలుగు ఐదు గంటలకు కుదించేశారట. దాంతో ఇప్పుడు వయసు పైబడ్డాక చాలా ఇబ్బందులు పడుతున్నారంట.
ఒక్కొక్కరికి ఒక్కోలా...
చివరకి ఇప్పుడు చెప్పాచ్చేదేంటంటే.. స్లీప్ స్పెషలిస్టుల ప్రకారం... ఎవరో చెప్పారని.. కచ్చితంగా కోడికూతకు ముందే నిద్రలేవాలని పెట్టుకోకండి. బాడీ తీరుని, జీన్స్ ని బట్టి ఒక్కొ క్కరికి ఒక్కో టైం నూట్ అవుతుంది. అందుకే మీరు ఏ టైం లో బాగా పని చేయగలుగుతున్నారో కనిపెట్టండి. ఏ టైంలో చేస్తే రిజల్ట్ బాగుందని మీకనిపిస్తుందో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఎప్పుడు లేవాలో....
త్వరగా నిద్ర లేవడం వల్ల..
౦ ఉదయాన్నే లేచే అలవాటు ఉంటే.. వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. దీనివల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. రోజూ వ్యాయామం చేయడం వలన మాన సికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.
౦ లక్ష్యాలు ఏర్పరచుకోవడానికి, రోజువారీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి వారు విజయాలను సాధించడంలో కొంచెం ముందుంటారు.
ఆలస్యంగా నిద్ర లేవటం వల్ల...
౦ సాఫ్ట్ వేర్, కంప్యూటర్ ఉద్యోగస్తులు కంప్యూటర్లపై చాలా సమయం పని చేస్తారు. వారి కళ్ళు, మెదడు బాగా అలసిపోతాయి. అలాంటి వారికి 8 గంటల నిద్ర కావలసిందే.
౦ మధ్యాహ్నం సమయంలో నిద్రించేకంటే ఉదయం వేళ ఆలస్యంగా లేచి రాత్రివరకు పనులు చక్కటి ట్టుకుంటే కూడా బాగానే వుంటుంది. మధ్యాహ్నం నిద్రపోయి లేస్తే అంతా డల్ గానే అనిపిస్తుంది. పిల్లలకు 10 సంవత్సరాల వరకు కనీసం 10 గంటల నిద్ర కావాల్సిందే.కనుక వారిని ఆరోగ్యం అంటూ అనవసరంగా బాధించకండి. వారికి కావ లసినంత సమయం హాయిగా నిద్ర పోనివ్వండి.