Health Alert : చెవుల్లో ఇయర్ బడ్స్ తో తెగ తిప్పుతున్నారా.. జర భద్రం..!

ఇయర్ బడ్స్ వాడుతున్నారా... అయితే భవిష్యత్తులో చెవుడు ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవుల్లో వుండే వ్యర్థాన్ని చెవులే సెల్ఫ్​ క్లీనింగ్ చేసుకుంటాయట.అందువల్ల మనం ప్రత్యేకంగా వ్యర్థాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనంలో తేలింది. 

 ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తే లోపల వుండే గులిమి కొంత మాత్రమే బయటికి వస్తుందట. మిగిలినది ఇయర్ బడ్స్ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ నుంచి ప్రయాణించే కర్ణభేరిపై పడుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే అలా ఎక్కువ మొత్తంలో గులిమి కర్ణభేరిపై పేరుకుపోతే.. కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వలన చెవుడు వస్తుందట, అందువల్ల ఇయర్ బడ్స్ ని వాడకపోవడమే మంచిది.

–వెలుగు, లైఫ్​–