వాట్సాప్‌లో ఇ–మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ వచ్చింది. ప్రస్తుతానికి ఇది ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు తమ ఇ–మెయిల్ ఐడీని వాట్సాప్ అకౌంట్‌కి లింక్ చేయొచ్చు. సెల్యులార్ నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు ఈ ఫీచర్ పనికొస్తుంది.
ప్రస్తుతానికి వాట్సాప్ అకౌంట్‌కి ఎస్సెమ్మెస్ మాత్రమే ప్రైమరీ వెరిఫికేషన్‌గా ఉంటోంది. ఇందుకోసం వాట్సాప్ ప్రొఫైల్ పేజ్ నుంచి అకౌంట్ మెనూలోకి వెళ్లి ఇ–మెయిల్ అడ్రెస్ యాడ్ చేయాలి. వెరిఫికేషన్ అవసరమైనప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు.. ఏఐ ఫీచర్ కూడా తీసుకొస్తున్నట్టు చెప్పింది కంపెనీ.
అమెరికాలోని కొందరు యూజర్లకు ఏఐ చాట్‌బాట్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయడానికి ఇది పనికొస్తుంది.