అలంపూర్​లో నేటి నుంచి దసరా ఉత్సవాలు

ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కుష్మాండ, స్కంద మాత, కాత్యాయిని, కాళరాత్రి

 మహాగౌరి, సిద్ధిధాత్రి రూపాల్లో అలంకరించి ఆరాధిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. 

- అలంపూర్, వెలుగు