నాగార్జున సాగర్‍కు ఉన్నట్టుండి భారీ వరద : 18 గేట్లు ఎత్తిన అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో అడపాదడపా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శనివారం(అక్టోబర్ 19) సాయంత్రానికి భారీ వరద చేరుతుంది. ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్కసారిగా గరిష్ఠ స్థాయికి చేరకోవడంతో 18 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జన సాగర్ కు లక్షా74వేల 120 క్యూసెక్కులు ఇన్ ఫ్లో  ఉండగా.. 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా45వేల 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 590.00 అడుగులు వరకూ నీరు నిలిచి ఉంది. గరిష్ఠ సామర్ధ్యం మేరకు 312.0450 టీఎంసీలు నీరు నాగార్జున సాగర్ లో ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ALSO READ | CM Revanth: గ్రూప్-1 ఎగ్జామ్స్ జరుగుతాయో.. లేదో.. తేల్చి చెప్పిన సీఎం రేవంత్