ప్రాణాలు ఫణంగా పెట్టి..

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది, ప్రాణాలను ఫణంగా పెట్టి.. వైర్లపై పడిన చెట్ల కొమ్మలను తొలగించారు.. తీగలను సరి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యుత్ ఉద్యోగుల రాజీలేని విధి నిర్వహణను ట్విట్టర్​లో ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ సిబ్బంది, ఎంప్లాయీస్​ను అభినందించారు.