Ducati Multistrada V4 RS: ఈ బైక్ ధర 38 లక్షలట!.. గాల్లో తేలిపోవచ్చు

ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌పై కూర్చొని గాల్లో రయ్.. రయ్‌మని దూసుకెళ్తుంటే.. ఆ మజానే వేరనుకో. కాకపోతే, ఆ ఆనందం అన్ని రోడ్లపై డోరకదు. స్పోర్ట్స్ బైకులకు తగ్గ రోడ్లు ఉండాలి. కాదు, కూడదు హైదరాబాద్ రోడ్లపై మేం స్టంట్స్ చేసి చేస్తామంటే పోలీసులు ఊరుకోరు. పొరపాటున జరగరానిది జరిగితే.. ఏ నిమ్స్‌లోనో.. ఏ అపోలోలోనో చేరి  చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కావున, అతి వేగం ప్రమాదకరం అని మరవకండి. అయినా, ఇవన్నీ తెలిసి చేసే వాడికి ఎంత చెప్పి ఏం లాభం.    

ఇప్పుడు చెప్పేదేంటంటే.. ప్రముఖ స్పోర్ట్స్ బైకుల సంస్థ కొత్త మోడల్ విడుదల చేసింది. ఇరవయ్యో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డుకాటి భారతదేశంలో మల్టీస్ట్రాడా V4 RSను ఆవిష్కరించింది. దీని ధర అక్షరాలా రూ.38 లక్షలు (INR 38,40,600). డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్‌తో అమర్చబడిన ఈ బైకులో ఓహ్లిన్స్ సస్పెన్షన్, అక్రాపోవిక్ సైలెన్సర్, టైటానియం వెనుక ఫ్రేమ్ ఉన్నాయి. ఈ బైక్‌పై వెళ్తుంటే అసలు వెళ్తున్నట్టే ఉండదట. ఇంత డబ్బు పెట్టాక వెళ్తున్నట్టు ఎందుకుంటది చెప్పండి.

మల్టీస్ట్రాడా V4 RS ఫీచర్లు

మల్టీస్ట్రాడా V4 RS, డెస్మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన V4 ఇంజన్‌ను అమర్చారు. ఇంజిన్ కెపాసిటీ.. 1,103cc. చెప్పాలంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌. ఇది దాదాపుగా 180బిహెచ్‌పి, 118ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ బైక్ బరువు.. 260 కిలోలు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం.. 22 లీటర్లు.

ALSO READ | జై జై BSNL.. జియో, ఎయిర్ టెల్, ఐడియా నుంచి భారీ వలసలు.. అంత బాగున్నాయా ప్యాకేజీలు..!