ఫిట్ నెస్ సాధించి విజేతలుగా ఎదగాలి : డీఎస్పీ రాజశేఖర రాజు

మిర్యాలగూడ, వెలుగు : యువత ఫిజికల్ ఫిట్ నెస్ సాధించి ప్రభుత్వ, ప్రైవేట్ కొలువులు సాధించి విజేతలుగా ఎదగాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బుధవారం రాత్రి నగదు, షీల్డ్​అందజేశారు. 

క్రీడాకారులకు భోజన వసతి కల్పించి టోర్నీని విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్లలను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నర్సిరెడ్డి, జిల్లా నేత ఈశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ రవినాయక్, ఆర్గనైజర్లు వెంకన్న, నాగరాజు, మనోహర్ భీమేశ్, అశోక్, రమేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.