డీఎస్సీలో సెలెక్ట్​ అయి పోస్టింగ్​ కోసం చక్కర్లు

నిజామాబాద్,  వెలుగు: డీఎస్సీ -2024 లో  సెలెక్టయిన తొమ్మిది మంది అభ్యర్థులు పోస్టింగ్​ కోసం డీఈవో, కలెక్టర్ ఆఫీస్​ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ​ సెలెక్షన్​ ప్రోసీజర్​ను రాతపరీక్ష మొదలుకొని అన్ని టెస్టులు ముగించినా పోస్టింగ్​ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. సోమవారం కూడా వారు ప్రజావాణిలో కలెక్టర్​ను కలవడానికి వచ్చారు.

 డీఎస్సీ పరీక్ష  తర్వాత గత నెల 9న సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా అపాయింట్​మెంట్​ లెటర్లు అందుకున్నామని మీడియాకు వాటిని చూపారు.  లెటర్లు అందుకొని సంతోషంతో తిరిగి వచ్చిన తమకు స్కూల్స్​లో పోస్టింగ్​ ఇవ్వక తిప్పుతున్నారని తెలిపారు. తమతో పాటు సెలెక్ట్​ అయిన అభ్యర్థులు డ్యూటీలో చేరి 25 రోజులు కావస్తోందని తాము అన్యాయానికి గురవుతున్నామన్నారు.