హమాస్ లీడర్ యహ్వా సిన్వార్ చివరి క్షణాలు.. డ్రోన్ వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్

హమాస్ చీఫ్ యహ్వా సిన్వార్ హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. సిన్వార్ తన ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో కుర్చీలో కూర్చున్న సిన్వార్ చనిపోయినట్లు..సిన్వార్ చివరి క్షణాల కు సంబంధించి వీడియోలను  ఇజ్రాయెట్ రక్షణ బలగాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ "చివరి క్షణాలు"గా చెప్పబడుతున్న డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. దాడుల్లో పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థలో మధ్యలో సిన్వార్ మంచం మీద కూర్చున్నట్లు గుర్తించారు. అయితే సిన్వార్ చివరి క్షణంలో ఇంట్లో కి ప్రవేశించిన డ్రోన్ పై దాడికి యత్నంచినట్లు కనిపిస్తోంది. 

Also Read :- హమాస్ చీఫ్ సిన్వార్ మృతి..డీఎన్ఏ టెస్టుతో గుర్తింపు

గురువారం నాడు ఇజ్రాయెల్ సైన్యాలు.. సిన్వార్ ను చంపినట్లు IDF సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా తెలిపాయి.  ‘‘అక్టోబర్ 7,2023 నాటి ఊచకోతకు కారణమైన హంతకుడు మరణించాడు’’ అని IDF  సైనికులు పోస్ట్ లో రాశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి దానియేల్ హగారీ ధృవీకరించారు. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వార్ చంపబడ్డాడు అని తెలిపారు.