ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ ఎటాక్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

టెల్ అవీవ్: హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్‌(62) మృతితో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఐడీఎఫ్ దళాలు హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్‌‎ను మట్టుబెట్టడంతో ఎలాగైనా ఇజ్రాయెల్‎పై రివేంజ్ తీర్చుకోవాలని హమాస్ పగతో రగిలిపోతుంది. ఈ క్రమంలో  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇంటిపై దాడి జరగడం సంచలనంగా మారింది. సిజేరియాలోని బెంజమిన్ నెతన్యాహు నివాసంపై డ్రోన్ ఎటాక్ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు దృవీకరించారు. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన సేఫ్‎గా ఉన్నారని తెలిపింది. ‘‘లెబనాన్ నుండి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం వైపు డ్రోన్ ప్రయోగించబడింది. ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి ఎయిర్ సెక్యూరిటీని దాటి డ్రోన్ ప్రధాని ఇంటిని టార్గెట్ చేసింది. 

ALSO READ :  గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ దాడి..33 మంది మృతి

ఈ సంఘటన సమయంలో నెతన్యాహు, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. ఈ డ్రోన్ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శత్రుదుర్బేద్యమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటి ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి జరగడంతో ఇజ్రాయెల్ దళాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమన సెక్యూరిటీ ఫోర్సెస్.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్‎పై శత్రు దేశాలు ఏకంగా ప్రధాని ఇంటిని టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ ఎటాక్‎పై హమాస్, హిబ్బొల్లా ఎలాంటి ప్రకటన చేయలేదు.