నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. వ్యర్థాలను తొలగించడం, అవయవాల పనితీరును క్రమబద్దీకరించడానికి సహాయ పడుతుంది.మన శరీరంలో 70 శాతం నీరుంటుందని అందరికి తెలుసు. అయితే శరీరంలో నీటి శాతం ఎక్కువైతే అది ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. రోజుకు ఎంత మోతాదులో నీరు తాగితే శరీరానికి మేలు కలుగుతుంది.. ఎక్కువ నీరు తాగడం వల్ల ఎలాంటి దుష్పలితాలు కలుగుతాయి? వంటి విషయాలను తెలుసుకుందాం.
హైపోనట్రేమియా రావచ్చు..
రక్తంలో సోడియం గాఢత తగ్గిపోయే స్థితిని హైపోనట్రేమియా అంటారు. అధిక నీరు శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడి వికారం, వాంతులు, తిమ్మిరి , హైపోనట్రేమియా , అలసట వంటి దుష్పలితాలకు దారి తీస్తుంది.
తలనొప్పి రావొచ్చు..
తలనొప్పి అనేది ఓవర్ హైడ్రేట్ లేదా డీహైడ్రేషన్ రెండింటీ లక్షణం. ఎక్కువ నీరు తాగినప్పుడు రక్తంలో ఉప్పు శాతం తగ్గుతుంది. ఇది మీ శరీరంలోని అవయవాలలో వాపుకు కారణమవుతుంది.
ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గుతాయి..
ఎక్కువ నీరు తాగినప్పుడు ఎలక్ట్రోలైట్ లెవెల్స్ పడిపోతాయి. తక్కువ ఎలక్ట్రోలైట్ లెవెల్స్ కండరాల తిమ్మిరికి కారణమవుతాయి.
అలసట
నీరు ఎక్కువగా తాగడం వల్ల అలసట పెరుగుతుంది. తాగే నీటిని ఫిల్టర్ చేస్తూ రక్తంలో ద్రవ స్థాయిలను సమతుల్యం చేసే బాధ్యత మూత్రపిండాలపై ఉంటుంది. ఎక్కువ నీటిని తాగడం వద్ల మూత్ర పిండాలపై పని భారం పెరిగి అది హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో శరీరానికి ఒకరకమైన అలసట కలుగుతుంది.
పోటాషియం లోపం
నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపానికి దారి తీస్తుంది. పొటాషియం మూలకం శరీరంలో ముఖ్యమైన మినరల్ . దీని లోపం వల్ల కాళ్లలో మంట, ఛాతి నొప్ప మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
తరుచుగా మూత్ర విసర్జన
ఎక్కువ నీరు తాగితే మూత్ర విసర్జన సమస్యలు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం పోషకాలను గ్రహించదు. దీంతో మూత్రం రూపంలో విలువైన పోషకాలు శరీరం నుంచి బయటకు వెళ్లి పోతాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. నిజానికి మన శరీరానికి ఎన్ని లీటర్ల నీళ్లు అవసరమవుతాయి? అనే దానికి ప్రత్యేకమైన ఫార్ములా ఏమీ లేదు. శారీరక శ్రమ, వయస్సు, లింగం, శరీర స్థితిని బట్టి నీటి మోతాడు మారుతుంటుంది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి సగటున రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలంటే..
పురుషులు - 15.5 కప్పులు అంటే 3.7 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు నీరు తాగొచ్చు
మహిళలు - 11.5 కప్పులు 2.7 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగొచ్చు.
శరీరానికి అవసరమయ్యే మేరకే నీటిని తీసుకోవాలి..అతి ఎప్పుడైనా అనర్థమే అని గ్రహించాలి. అయితే ఎండాకాలంలో ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి కాస్త ఎక్కువ తీసుకున్నా ఫర్వాలేదు.. అదే చలికాలం, వర్షాకాలంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి.