కూల్ డ్రింక్స్.. అంటే ఎండా కాలం తాగుతాం... వేసవి తాపాన్ని చల్లార్చి పొట్టలో కూల్ గా ఉండేందుకు రక రకాల డ్రింక్‌లు తాగుతాం.. అదే శీతాకాలం.. గడ్డ కట్టే మంచు... గజ గజ వణికే చలి.. దీనికి తోడు వ్యాయామం చేయకపోవడం...బరువు పెరగడం... తరచు అనారోగ్యానికి గురికావడం వంటివి జరుగుతుంటాయి. వీటికి సంబంధించి చెక్ పెట్టేందుకు కొన్ని రకాల వింటర్ డ్రింక్స్ తాగితే వ్యాధినిరోధక శక్తి పెరిగి.. రోగాలను అరికడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు ఆ పానీయాలు ఏంటో తెలుసుకుందాం.
శీతాకాలం... అదిరిపోయే చలి... దారి కనపడకుండా మంచు ... వెరసి పొద్దున్నే లేవలేకపోవడం.. వ్యాయామం చేయకపోవడం.. బాన పొట్ట పెరగడంతో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. వాకింగ్, యోగా లాంటివి లేకపోవడంతో కొవ్వు పెరిగి గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని రకాల వింటర్ డ్రింక్స్ తాగితేసమ్మర్ సీజన్ తో పోలిస్తే వింటర్ సీజన్ లో బరువు పెరిగే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. శరీరానికి తగిన శ్రమ లేకపోవడం. ఆహారం ఎక్కువగా తినాలనిపించడం, స్పైసి ఫుడ్ తినాలన్న కోరికలు పెరగడం వంటివన్నీ చలికాలంలో బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల పొట్ట దగ్గర చేరిన కొవ్వును కరిగించుకోవచ్చు. కానీ ఈ పానీయాలను వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
-
1. చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన పదార్థాలలో అల్లం ఒకటి. నీటిలో అల్లం తరుగును వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి ఒక గ్లాసులో వేయాలి. కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని దాన్ని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. పొట్ట దగ్గర కొవ్వు చేరే అవకాశం తగ్గుతుంది.
-
2. ఒక గ్లాసు పాలను వేడి చేసి అందులో ఒక స్పూను పసుపు కలుపుకోవాలి. నల్ల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని ప్రతి రోజు తాగుతూ ఉండాలి. దీనివల్ల కొవ్వు త్వరగా కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి తక్కువగా వేస్తుంది.
-
3. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మ చెక్క నుంచి తీసిన రసాన్ని వేసి బాగా కలపాలి. అందులోనే ఒక స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కూడా వేసి తాగాలి. ఇది జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఆహారాన్ని పూర్తిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అది కొవ్వుగా పేరుకోకుండా అడ్డుకుంటుంది.
-
4. నీటిలో ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. తర్వాత దాన్ని గ్లాసులో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఆ పానీయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆహారాన్ని తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారు ఈ దాల్చిన చెక్కతో చేసిన పానీయాన్ని తాగడం అవసరం.
-
5. గ్రీన్ టీని ప్రతి ఒక్కరూ తాగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ టీని మరీ వేడిగా తాగడం వల్ల ఉపయోగం ఉండదు. గోరువెచ్చగా మారాక అందులోని ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూను తేనె కలుపుకొని తాగితే మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.