సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. శరీరానికి ఉత్తేజాన్నిచ్చే గుణాలతోపాటు ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు కూడా దానిమ్మ పండ్లలో ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రతి రోజు ఉదయాన్నే గ్లాస్ దానిమ్మ పండ్ల జ్యూస్ తాగితే కలిగే లాభాలివి.. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పరగడుపునే దానిమ్మ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. ఈ జ్యూస్ సహజమైన యాస్పిరిన్లా పనిచేస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి.
దానిమ్మ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మలబద్దకం, అజీర్ణం సమస్యలు పోతాయి. విరేచనాలు తగ్గుతాయి. గొంతు ఇన్ఫెక్షన్, నొప్పి తగ్గుతుంది. దానిమ్మ పండ్ల జ్యూస్ ను వరుసగా 15 నుంచి 20 రోజుల పాటు తాగితే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలు పోతాయి. రక్తం వృద్ధి చెందుతుంది.