టీ... అంటే టేస్ట్ కాదు. అదొక ఎమోషన్ అంటారు టీ లవర్స్. రోజుకి ఎన్ని టీలు తాగినా ప్రతిసారీ... ఒకేలా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్లకోసమే రకరకాల టీలు మార్కెట్ లోకి వచ్చేశాయి. వచ్చిన ప్రతిదీ వదలకుండా ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్లు ఎంజాయ్ చేస్తూ తాగేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకో కొత్త టేస్ట్ ని పరిచయం చేస్తూ మరో స్పెషల్ టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రాలో టీ అమ్ముకునే అతను ఈ స్పెషల్ టీని అమ్ముతున్నాడు.
ఇంతకీ ఆ టీ స్పెషాలిటీ ఏంటంటే... మామూలుగా టీ చేయాలంటే పాలు మరగబెట్టి, టీ పొడి, చక్కెర, అల్లం లేదా యాలకుల పొడి వేస్తారు. కానీ, ఇతను మాత్రం అల్లం, యాలకుల బదులు కొంచెం మసాలా, ఒక స్పూన్ బటర్ ఆ టీలో వేస్తున్నాడు. ఆ టీ ప్రిపరేషన్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్ వ్యూస్, వేలల్లో లైక్స్, వందల్లో కామెంట్స్ వచ్చాయి.