స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకోండి : శ్రీకాంత్

జగిత్యాల, వెలుగు : ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ చదువుతున్న బీడీ కార్మికుల పిల్లలు స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకోవాలని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. 2024-–25 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ లో scholerships.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఆగస్ట్ 31 వరకు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9959444609లో సంప్రదించాలని సూచించారు.