- రూల్స్ కు విరుద్ధంగా ఉన్న వాటికి నోటీసులు
కొడిమ్యాల,వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పైన శనివారం జిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో మండల కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్, సంరక్ష హాస్పిటల్ లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదైన డాక్టర్ కాకుండా మరో డాక్టర్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి హాస్పిటల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ ను సందర్శించిడెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి పరమేశ్వరి, సిహెచ్ఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.