ఆర్మూర్లో ఇంటింటా ఫీవర్ సర్వే

ఆర్మూర్, వెలుగు : ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి  సోమవారం ఆర్మూర్ టౌన్ లో ఫీవర్ సర్వే నిర్వహించారు. సర్వేను డిప్యూటీ డీఎంఅండ్ హెచ్​వో రమేశ్​పరిశీలించి పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దోమలు వృద్ధి చెంది మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయన్నారు.  

వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో  సబ్ యూనిట్ ఆఫీసర్​సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, బట్టు విజయ, స్వాతి, ఆశా కార్యకర్తలు సరిత, వనిత, సూర్యం, రంజిత్ పాల్గొన్నారు.