బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు : పి. సుదర్శన్​ రెడ్డి

బోధన్​, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పి. సుదర్శన్​ రెడ్డి సూచించారు. శుక్రవారం బోధన్​మండలంలోని ఊట్​పల్లి, అమ్దాపూర్​, శక్కర్​నగర్, ఫాండుఫారం గ్రామాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలో పదేండ్లు పరిపాలన చేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.  కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

 కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరుగ్యాంటీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జీవన్​ రెడ్డికి ఓటువేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరావు, నాయకులు సంజీవరెడ్డి, నరేందర్ రెడ్డి, టప్పా సాయిలు తదితరులు పాల్గొన్నారు.