డిసెంబర్ 7 నుంచి దొంగ మల్లన్న జాతర.. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

గొల్లపల్లి, వెలుగు: గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ఈ నెల 7 నుంచి 29వరకు నిర్వహించనున్న దొంగ మల్లన్న జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. 

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుడిలో భద్రత ఏర్పాట్లపై తీసుకోనున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆలయ కమిటీ, గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతోష్, డీఎస్పీ రఘుచందర్, ఎస్ఐ సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలయ ట్రస్టీ శాంతయ్య, సత్యం,  తదితరులు ఉన్నారు.