కెనడా అమెరికాలో కలిసి పోవాలి.. డొనాల్డ్ ట్రంప్

కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాపై డొనాల్డ్ ట్రంప్ వేగంగా స్పందించారు. కెనడా యూఎస్ 51వ రాష్ట్రంగా చేరిపోవాలని అన్నారు. యూఎస్ లో చేరితే కెనడాకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించాడు. ట్రంప్ గతంలో కూడా కెనడా వాణిజ్య పద్దతులను విమర్శించారు. 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటనపై డైరెక్టుగా స్పందించకుండా..ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తారని ట్రంప్ అన్నారు. 

కెనడా భారీ వాణిజ్యాలపై రాయితీలు, చైనా, రష్యా నుంచి వచ్చే బెదిరింపులకు భద్రతను అందిస్తామని .. భవిష్యత్తులో కెనడా గొప్ప దేశం అవుతుందని ట్రంప్ చెప్పారు. 

కెనడా యూఎస్ లో భాగం కావాలనే ఆలోచనను ట్రంప్ తెరపైకి తేవడం ఇదే మొదటిసారి కాదు.. ట్రూడోతో తన మార్ ఏ లాగో రిసార్ట్ లోజరిగిన సమావేశంలో కూడా ప్రస్తావించారు. కెనడా ఆర్థిక వ్యవస్థ యూఎస్ టారీఫ్ ల కిందకు వస్తే అది ట్రోడో గవర్నర్ గా యూఎస్ లో విలీనం కావచ్చని ట్రంప్ సూచించారు. 

Also Read : కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం

అయితే ఇటువంటి పన్నులు కెనడా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తాయని ట్రూడో స్పందించినట్లు తెలిసింది. గతంతో కెనడా వాణిజ్య విధానాలను, ముఖ్యంగా యుఎస్‌తో దాని వాణిజ్య లోటు , వలస సమస్యలపై దేశం నిర్వహణను ట్రంప్ చాలా కాలంగా విమర్శిస్తునే ఉన్నారు. 

తాజా ట్రంప్ వ్యవహారంతో కెనడాను అమెరికాలో కలిపేయాలని ట్రూడోపై వత్తిడి పెంచినట్లుగాతెలుస్తోంది. ట్రూడో రాజీనామా, ట్రంప్ ప్రకటనతో కెనడా భవిషత్తుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..