కొంతమంది పిల్లలు అందరిముందు మాట్లాడడానికి భయపడుతుంటారు. టెన్షన్ పడుతూ ఏదైనా చెప్పేటప్పుడు తడబడుతుంటారు. దాంతో చెప్పాలనుకున్నది. క్లారిటీగా చెప్పలేకపోతారు. పిల్లలు ఇలా ప్రవర్తించడానికి కారణం వాళ్లలో కాన్ఫిడెన్స్ లేకపోవడం.
అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ల ఆలోచనలని, అభిప్రాయాలని స్పష్టంగా చెప్పడం అలవాటు చేయాలి. కాన్ఫిడెంట్ మాట్లాడడం నేర్పించాలి.
• పిల్లలు తమకి నచ్చిన, నచ్చని విషయాలు ధైర్యంగా చెప్పినప్పుడు వాళ్లని అభినందించాలి. అంతేకాదు వాళ్ల ఫీలింగ్స్, ఒయన్స్ వించాలి. వాళ్ల నచ్చినట్టుగా ఉండే స్వేఛ్ఛ ఇవ్వడం కూడా ముఖ్యమే.
• ఎమోషన్స్, ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయడం నేర్పించాలి. అంతేకాదు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో? ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్పాలి.
• పిల్లలు బాగా చదవడం, ఎగ్జామ్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం... ఇవి మాత్రమే వాళ్ల డెవలప్మెంట్ కి సరిపోవు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు కూడా నేర్పించాలి. దాంతో వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందిరితో తొందరగా కలిసిపోయే గుణం అలవడుతుంది కూడా.
• పిల్లలకి సొంతంగా ఆలోచించడం అలవాటు చేయాలి. వాళ్లకి సంబంధించిన కొన్ని విషయాల్లో వాళ్లే డెసిషన్ తీసుకునేలా ఎంకరేజ్ చేయాలి. ఇలాచేస్తే వాళ్లలో
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.