బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా కాకూడదంటే విటమిన్-సి ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూనే.. రెగ్యులర్ గా వర్కవుట్స్ చేయాలి. యోగాని అస్సలు స్కిప్ చేయకూడదు. ముఖ్యంగా ఈ ఆసనాలు వేస్తే బాడీ ఫిట్ గా ఉండటంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
ఉక్తాసనం..
నిటారుగా నిల్చొని చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. మోకాళ్లని కొద్దిగా వంచి కుర్చీలో కూర్చునట్టుగా గాల్లో కూర్చోవాలి. అలాగే ఉండి నడుము, చేతులను కుడి పక్కకు ట్విస్ట్ చేయాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ మునుపటి పొజిషన్లోకి రావాలి. మళ్లీ ఎడమవైపు శరీరాన్ని ట్విస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఆంజనేయాసనం..
మోకాళ్ల మీద స్టిఫ్ గా కూర్చోవాలి. తర్వాత కుడి మోకాలిని పైకి లేపాలి. ఎడమ మోకాలిని నేలకు ఆనించి సమాంతరంగా వెనక్కి చాపాలి. ఇప్పుడు తలను నెమ్మదిగా వెనక్కి వంచి రెండు చేతులను ఫొటోలో చూపిన విధంగా పైకి లేపాలి. తరువాత మెల్లగా శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపాలి. చేతులను కిందకు దించి నెమ్మదిగా శ్వాస వదిలి మునుపటి పొజిషన్ గా రావాలి.
బాలాసనం..
ఈ ఆసనం కోసం మోకాళ్లని మడిచి పిరుదులను పాదాలపై ఆనించాలి. శరీరాన్ని ముందుకు తీసుకొచ్చి ఛాతిని మోకాళ్లకు ఆనించాలి. తర్వాత నుదుటిని నేలకు ఆనించి చేతులను ముందుకు చాపాలి. ఈ పొజిషన్లో పదిసార్లు గాలి పీలుస్తూ వదలాలి. ఇలా చేయడం వల్ల అలసట, కడుపు ఉబ్బరం తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.