రామలచ్చక్కపేట్‌‌‌‌‌‌‌‌ లో కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేండ్ల బాబుపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం రామలచ్చక్కపేట్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన నిహాన్స్‌‌‌‌‌‌‌‌ శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ టైంలో రెండు కుక్కలు నిహాన్స్‌‌‌‌‌‌‌‌పై దాడి చేశాయి. 

గమనించిన కుటుంబ సభ్యులు కుక్కలను తరిమేసి, గాయపడ్డ బాబును మెట్‌‌‌‌‌‌‌‌పల్లి సివిల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న ఆఫీసర్లు స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.