పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వుపేరుకుపోవడం వల్ల గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్తదితర జబ్బుల బారిన పడేఅవకాశాలు ఉంటాయి. అలాంటివాళ్లు మితంగా ఆహారంతీసుకుంటూ.. ఎక్సర్సైజ్ లుచేస్తుండాలి. ప్రకటనల్లోచూపించినట్టుగా.. బరువుతగ్గడం కోసం, పొట్ట భాగంలోపేరుకుపోయిన కొవ్వునుకరిగించడం కోసం సప్లిమెంట్స్వాడినా పెద్దగా ఫలితం ఉండదు.పైగా అవి హాని చేసే అవకాశంఉంది. కాబట్టి టమ్మీ ఫ్యాట్తగ్గించుకోవాలనుకునే వాళ్లు కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం ఉత్తమం. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.
వేసవిలోకొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ అక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆహారం జీర్ణం కావడానికి, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గడానికిఎంతగానో ఉపకరిస్తాయి. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం వెంటనే రీహైడ్రేట్ అవుతుంది. కొబ్బరి నీళ్లు ఆకలిని తగ్గించడమే కాకుండా.. చర్మానికి మేలు చేస్తాయి.