Health Alert: విటమిన్ డి మాత్రలతో ఎలాంటి లాభం లేదట

ఎముకలు బలంగా ఉండాలంటే ఎమిటమిన్ డి కావాలి. ఎండ నుంచి విరివిగా లభించే విటమిన్ డి ఇంటికి, ఆఫీసుకే పరిమితమయ్యే వారిలో లోపిస్తోంది. అలాగే విటమిన్ డి జీవక్రియ లోపం వల్ల కూడా సమస్యలొస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పెళుసుబారతాయి. ఎముకల సాంద్రత పెంచడానికి, ఎముకల పెళుసుదనం తగ్గించడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.

మనం పాటిస్తున్నాం. ఈ సప్లిమెంట్ల వల్ల డబ్బులు గుల్లే కానీ రోగం నయం కావట్లేదని వైద్యులు తేల్చేస్తున్నారు. ఈ వివరాలను ద లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ నివేదిక విడుదల చేసింది. 53,537 మందిపై 81సార్లు నిర్వహించిన పరీక్షల ద్వారా ఎముక సంబంధ వ్యాధుల్లో విటమిన్ డి సప్లిమెంట్ల ప్రభావాన్ని అధ్యయనం చేశారు.

ALSO READ :- IND vs ENG: లక్కీ బాయ్: విఫలమైనా అతడికి ఛాన్స్ ఇస్తాం.. క్లారిటీ ఇచ్చేసిన రోహిత్

మూడొంతుల్లో ఒక వంతుమంది 65 ఏళ్లు పైబడిన మహిళలే ఉన్నారు. వారం వారం వైద్య పరీక్షలు చేస్తూ మూడునుంచి అయిదు సంవత్సరాల పాటు రోగుల వైద్య నివేదికలను అధ్యయనం చేసి ఈ అవగాహనకు వచ్చారట. ముఖ్యంగా ఆ స్టెరోపోసిస్ ఎదుర్కొనే వృద్ధులు విటమిన్ డి సప్లిమెంట్లు వాడుతున్నా వాటివల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఈ అధ్యయనం చెబుతోంది.