నల్లిబొక్క ఆగం జేసె!.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్ తొలగించిన డాక్టర్లు

వారంతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ తప్పనిసరిగా తింటున్నాడు. ప్లేటు నిండా  మటన్‌ ముక్కలు, నల్లి బొక్కలతో   భోజనం చేస్తున్నారు.  నల్లిబొక్కలతో ప్రాణాలు పోయే పరిస్థితి ఓ వృద్ధుడికి ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు నిన్న మటన్‌ కర్రీతో అన్నం తింటుండగా గొంతులో ఓ ఎముక ఇరుక్కుపోయింది. ఆ బొక్కను బయటకు తీయలేక ఆ వృద్ధుడు నానా ఇబ్బందులు పడ్డాడు.

నల్లిబొక్కను  గొంతు నుంచి తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా   రాకపోవడంతో చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అనంతరం వైద్యులు  గొంతులోంచి ఎముకను తొలగించడంతో వృద్ధుడు  ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.  ఈ విషయం అందరికీ తెలవడంతో నవ్వుకున్నారు.