కామారెడ్డిలో డాక్టర్ల నిరసన

కామారెడ్డిటౌన్, వెలుగు : హాస్పిటల్స్ ను ఇతర శాఖల అధికారులు రోజూ పరిశీలించాలని నల్లగొండ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కామారెడ్డిలో డాక్టర్లు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కామారెడ్డి జిల్లా హాస్పిటల్ ఎదుట డాక్టర్లు నిరసన చేపట్టారు.  

ఎమర్జెన్సీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌ మెంట్ పై ఇతర శాఖల ఆఫీసర్లు పర్యవేక్షణ చేసి రిపోర్టులు పంపటం ఏమిటని ప్రశ్నించారు. నల్లగొండ కలెక్టర్  ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని డాక్టర్లు కోరారు.