కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ ముందు డాక్టర్ల నిరసన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ముందు సోమవారం తెలంగాణ టీచింగ్​గవర్నమెంట్​డాక్టర్స్​అసోసియేషన్​ఆధ్వర్యంలో డాక్టర్లు నల్లబ్యాడ్జీలు  ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఐసీయూ వార్డులో ట్రీట్​మెంట్ ​పొందుతున్న పేషెంట్​ను ఎలుకలు కొరికిన ఘటనలో డాక్టర్లు వసంత్​కుమార్, కావ్య, నర్సింగ్​ఆఫీసర్​ మంజులను ఉన్నతాధికారులు సస్పెండ్​చేయడాన్ని నిరసిస్తూ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. వార్డులోని రోగికి ఎలుకలు కరవడానికి, డాక్టర్లకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. డాక్టర్లు పేషెంట్​బాగోగులు చూసుకుంటారే తప్ప శానిటేషన్​ పనులు చేయరన్నారు. డాక్టర్లపై విధించిన సస్పెన్షన్​ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్​చేశారు. ​ లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.

హెల్త్​ మినిస్టర్​ను కలిసిన అసోసియేషన్​ప్రతినిధులు

గవర్నమెంట్ ​హాస్పిటల్స్​ డాక్టర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు సోమవారం హెల్త్ మినిస్టర్ ​దామోదర రాజనర్సింహాను హైదరాబాద్​లో కలిశారు. కామారెడ్డిలో ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్​ఆఫీసర్​పై విధించిన సస్పెన్షన్ ను​ ఎత్తేయాలని విన్నవించారు. ఇతర సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మినిస్టర్​ను కలిసిన వారిలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్​కుమార్, శ్రీనివాస్ ​ఉన్నారు.