ఓ మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉంది. దాదాపు ఆమె పది సంవత్సరాలుగా పొత్తి కడుపు నొప్పితో బాధపడుతునే ఉంది. 12 సంవత్సరాలుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోయారు.
సిక్కింలోని 45ఏళ్ల మహిళ అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే చేదు అనుభవం ఎదరైంది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన ఆమె 2012లో గాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ (STNM) హాస్పిటల్‌లో అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స సమయంలో డాక్టర్లు ఓ కత్తెరను పేషెంట్ కడుపులోనే పెట్టి మర్చిపోయారు. అప్పటి నుంచి ఆమె కడుపులో 12 సంవత్సరాలుగా కత్తెర అలాగే ఉండిపోయింది. పలుమార్లు కడుపునొప్పితో బాధపడిన ఆమె హాస్పిటల్ కు వెళ్లినా.. డాక్టర్లు పేషెంట్ కడుపులో కత్తెర ఉందన్న విషయం గుర్తించలేకపోయారు.
ALSO READ | 3 కోట్ల విలువైన బంగారంతో మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ జంప్ !
2024 అక్టోబర్ 8న ఆమె మళ్లీ STNM ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు ఎక్స్-రే తీయగా.. ఆమె కడుపులో ఆపరేషన్ చేసే కత్తెర ఉన్నట్లు తేలింది. వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.