వామ్మో.. వీకెండ్ మాత్రమే తాగినా లివర్ ఇట్లయితదా..? ఈ డాక్టర్ పోస్ట్ చేసిన ఫొటో చూస్తే ఏమైపోతారో..!

వీకెండ్ వచ్చిందంటే చాలు. చాలా బ్యాచిలర్ రూమ్స్లో బీరులు ఏరులై పారుతుంటాయి. ఫుల్లులకు ఫుల్లులు మందు బాటిళ్లు ఖాళీ అయితుంటయి. వారంలో ఐదు రోజులు కష్టపడి మిగిలిన రెండు రోజులు మందు పార్టీల్లో మద్యం ప్రియులు చిల్ అవుతూ ఉంటారు. వీకెండ్ మాత్రమే తాగుతుంటారు కాబట్టి తమ కాలేయం కరాబు కాదని ఇలా వీకెండ్ తాగెటోళ్లు ఫిక్సయితుంటరు. కానీ.. ఇలా వీకెండ్ మాత్రమే తాగే ఒక ’వీకెండ్ ఓన్లీ డ్రింకర్’ లివర్ ఫొటో నెట్టింట వైరల్ అయింది. ఆ ఫొటో చూసిన మందుబాబుల్లో వణుకు మొదలైంది.

ఈ ఫొటోను కేరళలోని కొట్టాయంకు చెందిన హెపటాలజిస్ట్ సిరియక్ అబ్బి ఫిలిప్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. వీకెండ్ ఓన్లీ డ్రింకర్ లివర్ ఫొటో ఇది అని, ఎలాంటి దురలవాట్లు లేని ఆ మద్యం ప్రియుడి భార్య లివర్ ఫొటో ఇది అని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయింది.

ఆ డాక్టర్ పోస్ట్ చేసిన ఫొటో వెనుక ఉన్న కథేంటంటే.. 32 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి వీకెండ్స్ తెగ తాగుతూ తన లివర్ పాడు చేసుకున్నాడు. అతని భార్య లివర్ డొనేట్ చేసింది. కాలేయ మార్పిడి ఆపరేషన్ సందర్భంగా ఈ రెండు లివర్లను పోల్చుతూ డాక్టర్ వీటి ఫొటో షేర్ చేశారు. అతని భార్య లివర్ హెల్తీగా ఉన్నట్టు ఫొటో చూస్తే స్పష్టమైంది. కానీ.. ఆ ‘వీకెండ్ ఓన్లీ డ్రింకర్’ లివర్ చూసి నెటిజన్లు కంగుతిన్నారు. అతని కాలేయం నల్లగా.. పూర్తిగా పాడైపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భార్య లివర్ డొనేట్ చేయడంతో అతని కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది.