ముక్కోటి ఏకాదశి ఒక్క రోజే కదా.. మరి 10 రోజులు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఏర్పాటు చేస్తారు. ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠానికి సంబంధం ఏమిటి... దేవతలకు ... మానవులకు గణాంకాల్లో తేడా ఉందా.. ఉత్తర ద్వార దర్శనం 10 రోజులు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం.. . .
హిందూ పంచాంగం ప్రకారం తిథి... వార... నక్షత్రాన్ని పండుగలు.. ప్రత్యేకమైన రోజులు నిర్ణయిస్తారు. మన క్యాలండర్ ప్రకారం ఏడాదిలో మఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. ఈ ప్రకారం దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి నుంచి వెలుగులు చిమ్మే పగలు లోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి) మొదలు వరుసగా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం తెరచి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి, అందుకనే దేవాలయాల్లో 10 రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు.
భూలోకంలో 10 రోజుల గడువును... వైకుంఠంలో ఒక రోజుగా పరిగణిస్తారు. అందుకే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. ఈ పది రోజుల్లో ఎప్పుడు స్వామిని దర్శనం చేసుకున్నా ఒకే రకమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సత్య యుగంలో సంవత్సరానికి పది నెలలే ఉండేవి. మొదటి నాలుగు నెలలూ, వారి దేవుళ్ళ పేరిట; మర్షియస్, ఏప్రిలిస్, మెయస్, జూనియస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మాసాలకు సంఖ్యానామాలిచ్చారు. అవి, క్వింటిలిస్ (ఐదవది), సెక్సటిలిస్ (ఆరవది), సెప్టెంబర్ (ఏడవది), అక్టోబర్ (ఎనిమిదవది), నవంబర్ (తొమ్మిదవది), డిశంబర్(పదవది)
అంటే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. దేవలోకం లెక్క ప్రకారం ఏడాదిలోమొదటి నాలుగు నెలల్లో పుష్యమాసం వస్తుంది . ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. వైకుంఠ లోకంలో వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశినాడు ఓపెన్ చేసి ఉంచుతారు. కాని భూలోకంలో 10 రోజులు .. దేవ లోకంలో ఒక రోజుతో సమానమని వేదాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయని చెబుతారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము.సూర్యుడి గతి మీద ఆధారపడ్డ సౌర సంవత్సరం 365.25 రోజులు కావడంతో నైలు నది వరదలు సంవత్సర ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా అలస్యంగా వస్తూ వచ్చాయి .నెలకొక్కొక్క రాశి చొప్పున సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశులూ తిరిగి మళ్లీ తన ప్రస్థానం ప్రారంభిస్తాడు