బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలన్నా..రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా..పిల్లలు,పెద్దలు రోజువారీ ఆహారంలో బాదంపప్పులు, డ్రై ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే  డాకర్లు సూచించారు కదా అని ఎలా పడితే అలా వీటిని వినియోగిస్తే కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉందంటున్నారు. బాదంపప్పును ఎలా తినాలి.. బాదంపప్పును నానబెట్టి తినాలని అంటుంటారు ఎందుకు.. దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం..  

బాదం పప్పులో కొన్ని క్యాన్సర్ కారకాలు ఉంటాయి.ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. అందువల్ల వాటిని సరైన సమయంలో, సరియైన మార్గంలో తినడం చాలా ముఖ్యం. తద్వారా ప్రయోజనం పొందొచ్చు. 

బాదంపప్పును ఎలా తింటే మంచిది..?  

బాదంపప్పును రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు పొట్టు తీసి తినాలి. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే మూలకాలను తొలగిస్తుంది. నానబెట్టిన బాదంపప్పులో హానికరమైన రసాయనాలు ఉండవు. బాదం పప్పు తొక్కలో మాత్రమే హానికరమైన రసాయనాలు ఉంటాయి.వీటిని నానబెట్టడం ద్వారా తొలగించవచ్చు. 

కాలేయ క్యాన్సర్

బాదంపప్పు తొక్కలో ఆఫ్లా టాక్సిన్  బి1 అనే రసాయం ఉంటుంది. ఇది కాలేయ క్యాన్సర్ కు దారి తీస్తుంది. బాదంపప్పును నానబెడితే మంచి ప్రయోజనాలను అందిస్తుంది. 

బాదంపప్పును నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో మంచి ప్రోటీన్లు ఉంటాయి.ఇది బరువు తగ్గేందుకు  సాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటు( బ్లడ్ ప్రెషర్ ) ను అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన బాదంపప్పులో ఒమెగా త్రి ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే  గుండెకు చాలా మంచిది. ఇవి గుండెకు కావాల్సిన ఫ్యాటీ ఆమ్లాలను అందజేస్తాయి. 

పచ్చి బాదంపప్పును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే బాదంపప్పు ఎక్కువగా తినడం వల్ల నోటి అలెర్జీ , గొంతు నొప్పి, పెదవులు వాపు  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇంకా ఇతర దుష్ప్రభావాలు కలగొచ్చు. 

 మీకు గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉంటే బాదంపప్పును తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు బాదంపప్పు ను తింటే సమస్య మరింత ఎక్కువ కావచ్చు. 
బాదంపప్పును తినే ముందుక కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రాత్రి మొత్తం నానబెట్టిన బాదంపప్పులు  తింటే ఆరోగ్యంగా ఉంటారు..