Wonder Food: మస్క్ మెలన్ ధరతో.. 10 తులాల బంగారం వస్తుంది

 ఏ రకం పండు అయినా కిలో రెండు మూడు వందల్లోపే ఉంటుంది. మరీ క్వాలిటీ ఫ్రూట్స్ అయితే వెయ్యి రూపాయల్లో దొరుకుతాయి. కానీ, ఈ మస్క్ మెలాన్ ధర వింటే నోరెళ్లబెడతారు. ఈ పండు కొనేందుకు ఖర్చుచేసే డబ్బుతో ఏకంగా పది తులాల బంగారమే కొనుక్కోవచ్చు లేదంటే ఎక్కడైనా ఇంటిస్థలం కూడా కొనుక్కోవచ్చు. 

వీటి కిలో ధర 20 లక్షల రూపాయలు. ప్రపంచంలోనే ఖరీదైన ఈ పండుని జపాన్ లోని యుబరి అనే ప్రాంతంలో మాత్రమే పండిస్తారు. గ్రీన్ హౌస్ లో వీటిని సాగుచేస్తారు. అంత ధర ఉన్నాకూడా యుబరి మెలన్ కి జపాన్ లో మస్త్ డిమాండ్ ఉంది. 

ఈ పండుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ రావాలనిట్రై చేస్తున్నారట. అందుకే ఈ పండుకి అంత ధర అంటున్నారు స్థానికులు.

ALSO READ : Good Health : యుక్త వయస్సులో తక్కువ నిద్రతో వచ్చే ఇబ్బందులు ఇవే