అటు శరీరాన్ని.. ఇటు ఆత్మనూ పరిశుద్ధం చేసే విశేష ప్రక్రియే ఉపవాసం. ఉపవాసం అంటే పరమాత్మ ధ్యాసలో ఉండడంతప్ప బలవంతాన అన్న పానీయాలకు దూరంగా గడపడం కాదు. అన్ని మతాల్లోనూ ఉపవాస సంప్రదాయం కనిపిస్తుంది. అయితే ఒక్కో తరహాగా.. ఒక్కో ప్రాంతంలో అనేక పద్ధ తులు కనిపిస్తాయి. పద్ధతి ఏదైనా సరే మనసుపెట్టి ఏకాగ్రతతో చేయగలిగితే ఉపవాస ఫలితాలు అందుకోవచ్చుని ఇటు వైద్య నిపుణులు, అటు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
కార్తీకమాసం , ధనుర్మాసాల్లో వివిధ రకాల ఉపవాసాలతో కాలం . గడిపేస్తుంటారు. కొన్నిసార్లు ఉపవాసం మంచిదే. కారీ మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కడుపుమాడ్చుకుని చేసే ఉపవాసం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉపవాస సమయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు.
ఇలాంటివారు చెయ్యొదు
ఆరోగ్యం సహకరిస్తే తప్ప ఉపవాసం చేయ కూడదు. అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేయడం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. కొందరు అదే పనిగా వారంలో మూడు నాలుగు రోజులు ఉప వాసాలు చేస్తారు. నెలకు ఒకసారి ఉపవాసం చేయడంవల్ల ప్రయోజనం ఉంటుంది. కాని అదేపనిగా ఉపవాసాలతో పొట్ట మాడ్చుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
డయాబెటిస్ పేషెంట్స్, గర్భవతులు, ఏవైనాదీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవాడేవారు ఉపవాసం చేయకూడదు
ఉపవాసం సరిగ్గా చేయకపోతే శరీరం - లోని కొవ్వు అంటే కండరాలు ఎక్కువగా కరిగి పోతాయి.
మహిళలు స్ట్రెస్ పీరియడ్ గడిచిన వారం తర్వాత మాత్రమే ఉపవాసం చేయాలి. ఆ సమయంలో ఉపవాసాలు చేయడంవల్ల శక్తి క్షీణించి త్వరగా అలిసిపోయే ప్రమాదం ఉంది.
ఉపవాసం వల్ల ప్రయోజనాలు
సరైన పద్ధతిలో ఉపవాసం చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉసవాసం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి. క్లెన్బింగ్ జరుగుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తిమంతం అవుతుంది. శరీర విధుల నిర్వహణలో సమతుల్యత వస్తుంది. రక్తపీడనం త్వరగా తగ్గిపోతుంది. ఇది హైబీపీ ఉన్నవారికి మంచిదే కాని... లోబీపీ ఉన్నవారికి మాత్రం సమస్యలు వస్తాయి. ఉపవాసంవల్ల జీర్ణవ్యవస్థకు తగిన విశ్రాంతి దొరికి దాని పనితీరు మెరుగుపడు తుంది. ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకోవచ్చు. అదనపు కేలరీల బెడద లేనందున ఊబకాయం వంటి సమస్యలు త్వరగా రావు..
ఉపవాసం చేసేవారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాధ్యమైనంత వరకూ ఉపవాస సమ యంలో పనిభారం లేకుండా చూసుకోవడం మంచిది. చాలామంది మహిళలు తినాలనే ధ్యాసనుంచి దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా కాకుండా కొంచెం కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ ఉండాలి. ధ్యానం చేయడం మంచిది..ఉపవాసం చేసిన మర్నాడు ఆకలిగా ఉందని అతిగా తినేయకూడదు. ముందుగా ద్రవాహారం తీసుకోవాలి. ఆ తర్వాత ఘనాహారం తీసుకుంటే మంచిది. ఎక్కువ మసాలాలు కాకుండా తేలికపాటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అన్నం కూరలతో పాటు, సగ్గుబియ్యం జావ, పండ్లముక్కలు తినాలి.
ఉపవాసం కఠినంగా వద్దు
శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవ ణాలు పోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ కొవ్వులో నిల్వ ఉండవు, వీటిని ఆహారంలో తీసు కోకపోతే శరీరానికి ఏవిధంగానూ అందవు. రక్తంలో ఎమినోయాసిడ్స్ లేకపోయినట్లయితే జీవక్రియ ప్రభావం కండరాలపై పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేస్తుంటే. హార్మోన్లు ప్రభావితం అవుతాయి..అసలు ఏమీ తీసుకోకుండా చేసే కఠిన ఉప వాసాల వల్ల తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. జుట్టు పల్చబడి పోతుంది. ఆహారాల లోపాలకు సంబంధించిన ఇతర సమస్యలు తలెత్తుతాయి. అందుకే కఠి నంగా, చాదస్తంగా కాకుండా పోషకాహారం లభించే డ్రైఫ్రూట్స్, పండ్లు, తగినంత నీరు తీసు కుంటూ, పండ్లరసాలను తాగుతూ ఉపవాసం పాటించాలి.