Technology : మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఇలా చేయండి

సైబర్ దాడులు పెరుగుతున్న ఈ టైమ్ లో స్మార్ట్ ఫోన్ ని కూడా సేఫ్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే పర్సనల్ ఫొటోలు, ఫ్యామిలీ వీడియోలతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఫోన్లోనే సేవ్ చేసుకుంటారు చాలామంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా స్మార్ట్ ఫోన్ లోని డేటా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. అలాజరగకుండా ఉండాలంటే.... 

* అనుమానాస్పదంగా అనిపించే యాప్స్, వెబ్ సైట్ల నుంచి వచ్చే ఇ-మెయిల్స్ కు రిపై ఇవ్వొద్దు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగే లింక్స్ క్లిక్ చేయొద్దు. సేఫ్ కాని సాఫ్ట్వేర్లని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ అప్ డేట్ చేసుకోవాలి. ఆటో అప్డేట్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసి ఉంచాలి. అందుకోసం సెట్టింగ్స్ లో జనరల్ పై క్లిక్ చేసి, సాఫ్ట్వేర్ అప్డేట్, ఎనేబుల్ ఆటోమేటిక్ అప్డేట్స్ ని సెలక్ట్ చేయాలి. లేటెస్ట్ అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సిస్టమ్ బగ్స్ ఉంటే పోతాయి. 

* ఆండ్రాయిడ్, ఐఓఎస్ కంపెనీలు స్మార్ట్ ఫోన్ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్నాయి. ముందుగా బిల్ట్-ఇన్ సెక్యురిటీ ఫీచర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లాక్రాన్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. యాప్స్, డేటాకి కూడా లాక్ పెట్టడమే కాకుండా ఒకే పాస్వర్డ్ ని ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఫోన్ని ఎన్క్రిప్ట్ చేసుకుంటే ఫోన్లోని డేటా ఇతరుల చేతుల్లోకి పోతుందనే భయం ఉండదు. 

* ఫ్రీ హాట్ స్పాట్స్ ఉన్నచోట స్మార్ట్ ఫోన్ ని వైఫైకి కనెక్ట్ చేయడం రిస్క్. ఒకవేళ పబ్లిక్ ప్లేస్లో వైఫై వాడాలి అనుకుంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (విపిఎన్) వాడాలి. దాంతో వైఫై కనెక్షన్ మరింత సేఫ్ అవుతుంది.