Kitchen Tips : ఏ కూరలో ఏం కలిపితే.. త్వరగా ఉడుకుతాయి..!

వంట త్వరగా పూర్తవ్వాలి... దానికితోడు టేస్టీగా ఉండాలి అంటే ఈ ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. 
 

* ఆలుగడ్డలు ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే.. పొట్టు తేలికగా వచ్చేస్తుంది.

* గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఉప్పు వేసి పన్నీర్ కర్రీలో వేస్తే పన్నీర్ సాఫ్ట్ గా ఉంటుంది. గ్రేవీని కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. 

* పచ్చి బఠాణీ ఉడికించేటప్పుడు కొంచెం చక్కెర వేస్తే వాటి రంగు కాస్త తగ్గుతుంది. ఆకుకూరలకి కూడా ఈ టిప్ ఫాలో అవ్వొచ్చు.

* కుక్కర్లో పప్పు ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తేకుక్కర్ నుంచి పప్పు బయటకు పొంగదు

* పాస్తా, నూడుల్స్ ఉడికించేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుంటాయి. వాటిని విడగొట్టాలంటే వాటి మీద చన్నీళ్లు పోయాలి. 

* సిట్రస్ ఫ్రూట్స్, టొమాటో, చీజ్, చాక్లెట్స్ ని రూం టెంపరేచర్ లో ఉంచితే టేస్ట్ మారవు. 

* ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలంటే ముందు వాటిని ముప్పావు భాగం వేగించి, నాలుగైదు గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత మళ్లీ డీప్ ఫ్రై చేస్తే కరకరలాడతాయి. 

* ఆకు కూరలు వారం, పదిరోజులు ఫ్రెష్ గా ఉండాలంటే.. వాటిని తరిగి ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేయాలి.