Good Health : కుటుంబంలో టెన్షన్స్ను ఇలా జయించండి

వ్యక్తిగతంగా చాలా మందిలో.. చాలా ఆలోచనలు ఉంటున్నాయి. ఉద్యోగం ఉంటుందా? లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవుతుందా? జీతం సరిగా వస్తుందా? లేదా.. సగం జీతమే వస్తే, ఖర్చులు, ఈఎమ్ఐలు క్లియర్ ఎలా అవుతాయి? ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? ఇలాంటి ఆలోచనలు ఒకలాంటి డిప్రెషన్ కు దారితీస్తాయి. జాబ్ పోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఈ రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొన్న ఇబ్బంది ఇదే. అందుకని వీలైనంత స్టెబుల్ గా ఉండేందుకు ట్రై చేయాలి. 

పెద్ద ఇబ్బందులేంటి..?

జాబ్ పోయినా, సగం జీతమే వస్తున్నా.. ఏమీ కానట్టే గొప్పలకు పోతారు కొందరు. ఇదో రకం ప్రాబ్లమ్. ఐటీ ఉద్యోగాల్లో శని, ఆది వారాలు వీకెండ్ పార్టీలు, దోస్తులు, దావత్లు, కార్లు, టూర్ల సంగతి తెలిసిందే. 

ఒత్తిడి వద్దు.. 

జీతం వచ్చినా, రాకున్నా.. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే వాటిని మిస్ అవకూడదన్నట్టు ఉంటారు. ఈ లైఫెయిల్ మార్చుకోవాల్సి వచ్చేసరికి కష్టంగా అనిపిస్తుంది. లక్షల్లో ఉండే పిల్లల స్కూల్ ఫీజులు, ఫ్లాట్ ఈఎమ్ఐలూ తలకు మించిన భారం అవుతాయి. దాంతో ఫైనాన్షియల్ టెన్షన్ పెరిగిపోతుంది. డబ్బులు రాకపోవడం ఒక ఎత్తు.. స్టేటస్ కోల్పోవడం ఇంకో ఎత్తు. వీటి వల్ల మానసికంగా జరిగే సంఘర్షణ చాలా డిప్రెషన్లోకి తోసేస్తుంది. 
ఇది మగవాళ్లకే కాదు, ఆడవాళ్లలోనూ ఉంది. అదెలాగంటే.. చాలామంది అమ్మాయిలు జాబ్ చేసి పేరెంట్స్ ని చూసుకుంటున్నారు. 

ఒంటరితనం వల్ల.. 

ఐసోలేషన్ లో ఉండటం వల్ల కూడా డిప్రెషన్ బారిన పడతారు. ఇతర కారణాలు ఏవైనా తోడైతే సమస్య మరింత టఫ్ అవుతుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా ఎదురయ్యే ఇబ్బందులు. ఇక సొసైటీలో వచ్చే ఇబ్బందులు చెప్పాలంటే, కుటుంబ పరంగా ఎదురైన ఒత్తిళ్లు. ఈ పరిస్థితుల్లో కొన్నిచోట్ల భార్యాభర్తలు కొట్టుకోవడం, సూ సైడ్ చేసుకోవడం వంటివి కూడా జరిగాయి. ఆ పరిస్థితులు ఈమధ్య కొంత బెటర్ అయ్యాయి. 

పిల్లలపై ప్రభావాలు.. 

పిల్లలకు కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుస్తుంటాయి. దానికి తగ్గట్టు లిమిటేషన్స్ పెట్టుకోవడం వంటివి మెచ్యూరిటీతో చేస్తుంటారు. ఆన్ లైన్ లో చదవడానికి పడ్డ ఇబ్బందులు వంటివి వాళ్లలోనూ డిప్రెషన్ను తీసుకొచ్చాయి. రిజల్ట్స్ విషయంలో మెంటల్ టెన్షన్ పెట్టుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. చుట్టూరా ఒకేలాంటి ఒత్తిడితో ఉన్నవాతావరణం.. అంటే.. కరోనా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్.. అనే వార్తలు వింటుంటే.. ఎవరిలోనైనా సరే డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. 

బిజీగా ఉండాలి..

ఏదో ఒక పని కల్పించుకుని బిజీగా ఉండే ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మానసిక ప్రశాంతతకి ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. టైంకి తినాలి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉండాలి. అలాగే వీట న్నింటితో పాటు.. సోషల్ స్కిల్స్ నేర్చుకోవాలి. కొత్త వర్క్ ఏదన్నా నేర్చుకుంటే పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. మనిషి ఆలోచనలను ఒత్తిడిలోకి నెట్టేసే రూమర్స్ పట్టించు కోకూడదు.

స్టూడెంట్స్ కోసం.. 

స్టూడెంట్స్ అకడమిక్ ఇయర్ పోయిందని ఆలోచించడం మానేయాలి. సాధించాల్సింది చాలా ఉందన్న కాన్సెప్ట్ ముందుకు పోవాలి. ఒక ఏడాది మిస్ అయినంత మాత్రాన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పూర్తిగా వెనకబడినట్టు కాదు. మనమే ఆగిపోలేదు. ప్రపంచం కూడా ఆగింది. అందుకని.. భయపడక్కర్లేదు. 
కొన్ని దేశాల్లో గ్యాప్ ఇయర్' తీసుకుని చదివే పిల్లలు కూడా ఉంటారు. ఆ టైంలో లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. అకడమిక్ మిస్ అయినవి ఇంట్లో కూడా నెమ్మదిగా చదువుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఫ్లెక్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, యాక్టివ్ థింకింగ్, పేషెన్స్ వంటి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ పెంచుకుంటే లైఫ్ బాగుంటుంది.