Beauty Tips : రింగుల జుట్టు, కర్లీ హెయిర్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

కర్లీ హెయిర్ ఉంటే జుట్టు కాస్త పలుచగా ఉన్నప్పటికీ.. ఒత్తుగా కనిపిస్తుంది. పైగా అలల్లా ఎగురుతూ క్యూట్ లుక్స్ ఇస్తుంది. అందుకే వేలు ఖర్చు పెట్టి కర్ల్స్ చేయించుకుంటున్నారు చాలామంది. ఉంగరాల జుట్టు కోసం కనిపించిన ప్రొడక్ట్స్ అన్నీ వాడుతుంటారు కూడా. కానీ, ఇవేం లేకుండా నేచురల్ గానూ కర్లీ హెయిర్ సొంతం చేసుకోవచ్చు. సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్ను కరీగా మార్చడానికే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్.

* వెంట్రుకలు డ్యామేజ్ అవ్వకుండా ఉంగరాల జుట్టు కావాలంటే జుట్టును అల్లుకోవడం బెస్ట్ ఆప్షన్. జుట్టుని చన్నీళ్లతో లేదా హెయిర్ స్ప్రేతో బాగా తడపాలి. అది 60 శాతం ఆరాక చిన్నచిన్న పాయలు వీలైనన్ని ఎక్కువ తీయాలి. ఇప్పుడు రెండూ జుట్టు త్వరగా లేదా మూడు పాయల్ని కలిపి టైట్ గా అల్లాలి. ఒక రాత్రంతా లేదా ఐదారు గంటలు జుట్టుని అలా వదిలేయాలి. మరుసటి రోజు ఆ పాయలు విప్పి చేత్తో దువ్వితో నేచురల్ గానే వస్తాయి.

* లూజ్ కర్ల్స్ కావాలనుకుంటే బన్ హెయిర్ స్టైల్ ట్రై చేయాలి. దీనికోసం జుట్టుని రెండు పార్ట్లుగా చేసి చిక్కులు లేకుండా బాగా దువ్వాలి. కుడి వైపు జుట్టుని కుడివైపు తల భాగం పైన, ఎడమ వైపు జుట్టుని ఎడమవైపు తల భాగంపైన టైట్గా ముడివేయాలి. ముడి వదులు కాకుండా బాబీ పిన్స్, రబ్బరు బ్యాండ్ పెట్టుకోవాలి. కొన్ని గంటల తర్వాత ఆ ముడి విప్పితే జుట్టు రింగులు తిరుగుతుంది. అయితే తక్కువ కర్ల్స్ కావాలనుకుంటే.. జుట్టంతా కలిపి ఒక్కటే ముడి వేయాలి.

* టీషర్ట్ తోనూ సిల్కీ హెయిర్ని కరీగా మార్చొచ్చు. పాత టీషర్ట్స్, పొడవాటి, పల్చటి స్ట్రిప్స్ కత్తిరించాలి. ఇప్పుడు జుట్టుని శుభ్రంగా కడిగి, మెత్తటి టవల్ తో తుడవాలి. పూర్తిగా ఆరాక చిక్కులు లేకుండా దువ్వి, చిన్నచిన్న పాయలు తీయాలి. ఆ పాయల చివర్లకి టీషర్టు స్ట్రిప్సిన్ని ముడివేయాలి. ఇప్పుడు వాటిని రోల్ చేసుకుంటూ స్కాల్ప్ వరకు తీసుకెళ్లి మళ్లీ ముడివేయాలి. మిగిలిన పాయల్ని ఇలానే చేసి, పన్నెండు గంటలు వదిలేస్తే జుట్టు నేచురల్ ఉంగరాలు తిరుగుతుంది.

• సాక్సులతోనూ జుట్టుని కర్టీగా మార్చు కోవచ్చు. హెయిర్ స్ప్రేతో జుట్టుని తడపాలి. జుట్టు కొంచెం ఆరాక చిన్న పార్టిషన్స్ చేయాలి. ఒక్కో సాక్స్ ని ఒక్కో పార్టిషన్స్తో కలిపి జడలా అల్లాలి. అలా ఒక రాత్రంతా వదిలేస్తే తెల్లారి జుట్టు కర్స్ తిరిగి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కానీ, ఇవన్నీ బాగానే ఉన్నా ఉంగరాల జుట్టుతో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. మరి వాటికి సొల్యూషన్స్ కావాలి కదా.. అవేంటంటే...

కర్లీ హెయిర్ కేర్...

* ఉంగరాల జుట్టు త్వరగా పొడి బారుతుంది. ఇలా కాకూడదంటే తక్కువ ఉన్న షాంపూతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. అలాగే జుట్టు తేమని కోల్పోకుండా ఉండాలంటే తలస్నానం చేసే గంట లేదా రెండుగంటల
ముందు జుట్టుకుదుళ్ల నుంచి చివర వరకు నూనె మసాజ్ చేయాలి.

* కర్లీ హెయిర్ ఉన్నవాళ్లకి జుట్టులో చెమట ఎక్కువగా పడుతుంటుంది. దానికి కారణం మాడుకి సరిగా గాలి అందకపోవడమే. అందుకే ఎక్కువ టైం తలను కప్పేయకుండా గాలి ఆడేలా వదిలేయాలి.

* కర్లీ హెయిర్ ఉన్నవాళ్లకి చుండ్రు, ఇతర అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని కంట్రోల్ చేయాలంటే తలస్నానానికి అరగంట ముందు నూనెను తలకు పట్టించి మర్దనా చేయాలి.

* కర్లీ హెయిరికి పళ్ల మధ్య ఎక్కువ ఎడం ఉండే దువ్వెనలనే వాడాలి. అలాగే 6 నుంచి 8 వారాల కోసారి జుట్టు చివర్లను కత్తిరించాలి.

నేచురల్ గా కర్లీ హెయిర్ కావాలనుకునే వాళ్లు ట్విస్ట్ అండ్ రోల్ ట్రిక్ ని కూడా ఫాలో అవ్వొచ్చు. దీనికోసం చన్నీళ్లతో జుట్టుని తడపాలి.. తర్వాత వెడల్పాటి పళ్లు దువ్వెనతో చిక్కులు లేకుండా దువ్వాలి. జుట్టు ముందు భాగం నుంచి చిన్నచిన్న పాయలు తీసి ఏదో ఒక డైరెక్షన్ లో వాటిని ట్విస్ట్ చేయాలి. ఆ ట్విస్ట్ చేసిన పాయల్ని ఒక్కొక్కటీ రోల్ చేసి బాబీ పిన్ లేదా రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఒక రాత్రంతా జుట్టుని అలానే వదిలేస్తే తెల్లారి కర్స్ అలల్లా కనిపిస్తాయి.

Also read : నిమ్మకాయలు, పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి