Tech : మీ ఫోన్ బ్యాటరీ ఊరికే డౌన్ అవుతుందా.. ఇలా చేయండి..!

పొద్దున నుంచి రాత్రి దాంక... ఇప్పుడు పనులన్నీ స్మార్ట్ఫోన్లనే అయితున్నయ్. కానీ, ఆ ఫోన్ కి పొద్దున హండ్రెడ్ పర్సెంట్ చార్జింగ్ పెడితే, సాయంత్రానికే బ్యాటరీ డౌన్ అయి డెడ్ అయితున్నయ్. పోనీ చార్జింగ్ పెట్టాలంటే.. దానికి మూడు,నాలుగు గంటలు టైమ్ తీసుకుంటుంది. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. బ్యాటరీని త్వరగా చార్జ్ చేయొచ్చు. అలాగే ఎక్కువ సేపు చార్జింగ్ ఉండేలా చూసుకోవచ్చు.


స్క్రీన్ లాక్ వెయ్యాలె

స్మార్ట్ ఫోన్ని లాక్ చేసి ఉంచినా... బ్యాక్ గ్రౌండ్లో ఎప్పుడూ కొన్ని యాప్స్ రన్ అవుతూనే ఉంటాయి. చార్జింగ్ పెట్టిన తర్వాత మొబైల్ ఫోన్ను అలానే వదిలేస్తుంటారు. చాలామంది. దానివల్ల బ్యాటరీ చార్జ్ అవుతుండగానే.. అందులో కొంతశాతం ఆ బ్యాక్ గ్రౌండ్ యాప్స్కు పోతుంది. అందుకే... అలా కాకుండా క్యాచి మొత్తం క్లియర్ చేసి ఫోన్ లాక్ చేసి పెట్టాలి. ఇలా చేసినప్పుడు చార్జింగ్ ఫాస్ట్ గా ఎక్కడమే కాకుండా.. బ్యాటరీ కూడా ఎక్కువసేపు వస్తుంది.

స్విచ్ ఆఫ్ చెయ్యా

మొబైల్ చార్జింగ్ పెట్టే ముందు 'ఇప్పుడు నాకు ఏ కాల్స్ రావు' అని డిసైడ్ అయితే... ఆ టైంలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి చార్జింగ్ పెడితే మంచిది. ఇట్ల చెయ్యడం వల్ల... సిగ్నల్ రిసీవింగ్ ఉండదు. కాబట్టి చార్జింగ్ త్వరగా అవుతుంది. ఇలా చేస్తే కచ్చితంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది.

అన్నీ క్లోజ్ చెయ్యాలె

ముందుగా రన్నింగ్ లో ఉన్న యాప్స్ అన్నీ క్లోజ్ చేయాలి. వైఫై, ప్లే స్టోర్, బ్లూటూత్ వంటివి కూడా ఆఫ్ చేసి... మొబైల్ ను చార్జ్ చేయడం. మంచిది. ఇలా చేస్తే మొబైల్ ఫోన్ ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది.

ఫ్లైట్ మోడ్లో పెట్టాలె

కాల్స్ ఏవీ రావనిపించినప్పుడు.. చార్జింగ్ త్వరగా అవ్వాలనుకున్నప్పుడు.. మొబైల్ ను ఫ్లైట్ మోడ్లో పెట్టడం మంచి అలవాటు. ఈ మోడ్ లో పెట్టడం వల్ల సాధారణంగా చార్జింగ్ ఎక్కే వేగం కంటే... మరింత వేగంగా చార్జ్ అవుతుంది. ఎందుకంటే, ఫ్లైట్ మోడ్ లో పెట్టినప్పుడు కూడా సిగ్నల్ రిసీవింగ్ ఆగిపోతుంది.

ఒరిజినల్ ఛార్జర్ నే వాడాలె చాలామంది తమ మొబైల్ తో వచ్చిన చార్జర్ కాకుండా.. తమకు అందుబాటులో ఉన్న వేరే కంపెనీ చార్జర్లను వాడుతుంటారు. అన్ని ఫోన్లకు అన్ని రకాల చార్జర్లు సెట్ అయినా.... వాటిని వాడడం వల్ల బ్యాటరీ చాలా నెమ్మదిగా చార్జ్ అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఎక్కడకు వెళ్లినా... మొబైల్ తో పాటు వచ్చిన చార్జర్ నే వెంట తీసుకెళ్లాలి. అలాగే డేటా కేబుల్ కూడా నాణ్యమైనదే వాడాలి. అలా చేస్తే మొబైల్ ఫాస్ట్ గా చార్జ్ అవ్వడమే కాకుండా, బ్యాటరీ వీక్ అవ్వకుండా ఉంటుంది.