Good Health : మొబైల్ స్క్రీన్ వల్ల చర్మం పాడవుతుందా.. !

గంటల కొద్దీ కంప్యూటర్ మీద పనిచేయడం, ఫోన్లో సోషల్ మీడియా పోస్ట్లు చూస్తూ గడపడం, షోలు, వీడియోలు చూడడం... లైఫ్ స్టయిల్లో భాగం అయింది. దాంతో చాలా మందిలో బ్లూ లైట్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. 20 నిమిషాలు మండే ఎండలో ఉంటే చర్మం ఎంత డ్యామేజ్ అవుతుందో, 48 గంటలు డిజిటల్ స్క్రీన్ చూసినా అంతే డ్యామేజ్ అవుతుందట. 

ఇలా చేస్తే బెటర్......

* ఎలక్ట్రానిక్ డివైజ్లకి స్క్రీన్ గార్డ్ పెట్టుకోవాలి. కొత్తగా వస్తున్న కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైజ్లోల్లో బ్లూ లైట్ని డిజేబుల్ చేసే ఆప్షన్ ఉంటుంది. అలాంటి డివైజ్లు
ఉపయోగిస్తే కళ్లు, చర్మం దెబ్బతినవు. 

• ఎండలో బయటికి వెళ్లేటప్పుడు మామూలు సన్ ని బదులు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న సస్క్రీన్ రాసుకోవాలి. ఇవి బ్లూ లైట్ వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా చూడడమే కాకుండా చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి. అందుకే మార్నింగ్ రొటీన్ లో భాగంగా సన్ స్క్రీన్ రాసుకుంటే మరీ మంచిది.

• యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలు, ఆరెంజ్, కివి వంటి పండ్లు తినాలి. బీన్స్, బ్రకోలి, క్యారెట్లు, బీట్ రూట్, పాలకూర వంటివి తిన్నా కూడా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.