అవునా.. నిజమా : వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా.. ఎలా.. ఎందుకు..?

ఒకప్పుడు ఫ్రీజ్, వాషింగ్ మెషిన్ అంటే... "అమ్మో..! అవి కొనడం మా వల్ల ఎక్కడవుతుంది? అవన్నీ గొప్పాళ్ల ఇంట్లోనే ఉంటాయి" అనే వాళ్లు. ఇప్పుడు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈఎంఐ, జీరో డౌన్పేమెంట్ అంటూ బోలెడన్ని ఆఫర్లు రావడంతో... ఫ్రిజ్, వాషింగ్ మెషిన్లు వంటివి లోయర్ మిడిల్ క్లాస్ ఇళ్లలోనూ కనిపిస్తున్నాయి. కొవడం వరకు ఒకే.. కానీ వాటిని ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారన్నదే ముఖ్యం. వాషింగ్ మెషిన్​ను  సరిగా క్లీన్ చేయకపోతే.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి

 ఎంత సేపు బట్టలపై అంటిన మరకలు పోయాయా? దుమ్ము లేకుండా శుభ్రమయ్యాయా? మంచి వాసన వస్తోందా? అని మాత్రమే చూస్తుంటారు. కానీ మెషిన్ శుభ్రంగా ఉందా లేదా అని పట్టించుకోరు. చాలామంది అసలు దాని గురించి ఆలోచించరు కూడా. వారం వారం కాకపోయినా నెలలో ఒక్కసారైనా ఇంట్లో వాషింగ్ మెషిన్ ని శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు ఎలా శుభ్రం చేయాలి? ఎలా౦టి డిటర్జెంట్ వాడాలి? 

మిక్సింగ్ లోడ్స్...

చాలామంది చిన్నపిల్లల బట్టలను పెద్దవాళ్ల బట్టలతో కలిపి మెషిన్ లో వేస్తారు. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంటికొచ్చిన వాళ్ల బట్టలను కూడా మిగతా వాటితో కలిపి ఉతుకుతారు. వాటిలో లో- దుస్తులు కూడా ఉంటాయి. అలా కలిపి మెషిన్ లో వేసినప్పుడు... క్రిమికీటకాలు వ్యాపించే అవకాశం ఉంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు స్కిన్ ఇన్ ఫెక్షన్​ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వాషింగ్ మెషిన్ లో పిల్లల బట్టలు, బెడ్​ షీట్స్​, టవల్స్ ని విడివిడిగా ఉతడాలి.

వేడి నీళ్లే వాడాలి...

వాషింగ్ మెషిన్ లోకి పంపే నీళ్ల టెంపరేచర్ ఇరవై డిగ్రీల పైనే ఉండాలి. కానీ చాలామంది సంపుల్లో ఉన్న చల్లటి నీళ్లతోనే బట్టలు ఉతుకుతారు. నీళ్లు వేడిగా ఉంటేనే బట్టల్లో ఉన్న వ్యాక్టీరియా, వైరస్ చనిపోతుంది. అలాగే మెషిన్ లో నుంచి తీసిన బట్టలను సూర్యరశ్మిలో ఆరబెట్టాలి. బట్టలే కాకుండా మెషిన్ ని శుభ్రం చేసేటప్పుడు కూడా వేడి నీళ్లు ఉపయోగించాలి. అప్పుడే మెషీన్లో ఎక్కువగా ఉండే ఈ–-కొలీ అనే బ్యాక్టీరియా చనిపోతుంది.

ఎలా శుభ్రం చేయాలి

నెలలో ఒకసారి కచ్చితంగా మెషిన్ వాష్ చేయాలి. టబ్ ఒక్కటే కాకుండా. డిటర్జెంట్ డ్రాయర్ రబ్బర్ రింగ్ లాంటివి కూడా శుభ్రం చేయాలి. అయితే దానికోసం వేడి నీళ్లనే ఉపయోగించాలి. 

మార్కెట్లో మెషిన్​ ని  కడిగే డిటర్జెంట్ సెపరేట్ గా దొరుకుతుంది. దాన్ని మెషిన్ లో వేసి, పవర్ ఆన్ చేసి క్లీన్ బటన్ నొక్కాలి.  అంతేకాదు బట్టలు ఉతికిన ప్రతిసారీ ద్ డైల్యూటెడ్ బ్లీచ్​ లో  ముంచిన  క్లాత్​ తో మెషీన్ లోపలి భాగాలను తుడువాలి. డిటర్జెంట్ లో కూడా ఎకో–ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్​ వాడాలి. వాషింగ్​ మెషిన్​ అయ్యాక కొద్దిసేపు డోర్​ తెరిచి ఉంచాలి. 
ఏ డిటర్జెంట్ బెటర్ ఆప్షన్?

మెషిన్ ఉతకడానికి, అందులో వేసే డిటర్జెంట్ చాలా ముఖ్యం. పౌడర్, లిక్విడ్, ట్యాబ్లెట్ ఇలా రకరకా డిటర్జెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. కొందరు  పౌడర్ బెటర్ అంటే మరికొంతమంది లిక్విడ్ సేఫ్ అంటున్నారు. వాటిలో ఏది ఎందుకున్నా అది నాణ్యమైనది ఉండాలంటున్నారు నిపుణులు.

 వాషింగ్ పూర్తయ్యాక కూడా కొంత పౌడర్ డ్రాయర్లో అలాగే మిగులుతోందని, బట్టలపై ముద్దగా ఉంటోందని కొంతమంది చెప్తున్నారు. అందువల్లే ఈ మధ్య చాలామంది ధర ఎక్కువైనా లిక్విడేనే ఎంచుకుంటున్నారు. ఎక్కువ ఖర్చు చేయలేమనుకుంటే, రోజువారీ బట్టలకు పౌడర్, ముఖ్యమైన బట్టలకు కి లిక్విడ్​  వాడొచ్చు. ఇలా డిటర్జెంట్ మార్చడం వల్ల మెషిన్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.